Pushpa 2
Pushpa 2 : ఇటీవల లాస్ ఏంజెల్స్ వేదికగా ఆస్కార్ వేడుక ముగిసింది. అనోర, బ్రూటలిస్ట్, కాంక్లేవ్ వంటి చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. ఆస్కార్ గెలవడం ప్రతి ఒక్కరి కల. ప్రపంచ సినిమా వేదికపై దక్కే అరుదైన గౌరవం. ఆస్కార్ అందుకోవాలనే తపన చాలా మందిలో ఉంటుంది. అది మనకు సాధ్యం కాని వ్యవహారం అని కొందరు భావిస్తారు. మరికొందరు ప్రయత్నం చేస్తారు. ఆస్కార్ కి నామినేట్ కావడం, అవార్డు గెలవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడాను.
అనోర నిర్మాతలు ఆస్కార్ కోసం ఏకంగా రూ. 149 కోట్లు ఖర్చు చేశారట. ఇక బ్రూటలిస్ట్ మూవీ టీమ్ రూ. 83 కోట్లు, కాంక్లేవ్ నిర్మాతలు అత్యధికంగా రూ. 166 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. సినిమాలో విషయం ఉండాలి కానీ.. కోట్లు ఖర్చు చేస్తే అవార్డు రావడం ఏమిటనే సందేహం రావొచ్చు. అకాడమీ సభ్యుల దృష్టిని ఆకర్షించడానికి, మనం ఒక మంచి సినిమా చేశామని ప్రపంచానికి తెలియడానికి ఖర్చు చేయక తప్పదు. ఆస్కార్ కి నామినేట్ అయ్యేందుకు ఒక సినిమాను ప్రమోట్ చేసే ఏజెన్సీలు అమెరికాలో ఉన్నాయి. వారు కోట్లలో ఛార్జ్ చేస్తారు.
Also Read : భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ అయిన పుష్ప-2 మూవీ.. అయినా ఆయనకు భారీ నష్టాలు ?
ముఖ్యంగా విదేశీ సినిమాలను పీఆర్ ఏజెన్సీల ద్వారా ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ఆస్కార్ కి ముందు వివిధ అంతర్జాతీయ సినిమా వేదికల మీద ఆ చిత్రాన్ని ప్రదర్శించాలి. ఇతర అంతర్జాతీయ సినిమా అవార్డుల కోసం పోటీపడాలి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ గెలవడం సులభం అయ్యింది. రాజమౌళి టీం దాదాపు ఓ ఆరు నెలలు ఆస్కార్ కోసం యూఎస్ లో క్యాంపైన్ చేశారు. రూ. 80 నుండి 100 కోట్లు ఖర్చు చేశారు. వారి నమ్మకం నిలబెడుతూ ఆర్ ఆర్ ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది.
పుష్ప 2 ఆస్కార్ కి నామినేట్ కావాలి అంటే.. భారీగా ఖర్చు చేయాలి. కనీసం రూ. 100 కోట్లు వెచ్చించాలి. రాజమౌళికి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి, ఆయన సలహాలు తీసుకోవాలి. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా వివిధ ఏజెన్సీలతో మాట్లాడి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో ఉండేలా కృషి చేశాడు. కాబట్టి పుష్ప 2 ఆస్కార్ కి వెళ్లాలి అంటే ఖర్చుతో పాటు నెలల తరబడి యూఎస్ లో ఉండి క్యాంపైన్ చేయాలి. అల్లు అర్జున్, సుకుమార్ లకు ఇది సాధ్యమేనా? అనే సందేహమే. అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కొన్ని ఆర్ట్ ఫిలిమ్స్ అవార్డులు కొల్లగొడతాయి.
Also Read : మరో వివాదంలో పుష్ప 2, అసలు పర్మిషన్ ఎలా ఇస్తున్నారంటూ ఫైర్!
Web Title: Pushpa 2 oscar costs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com