Pushpa 2: కనీసం ట్రైలర్ కూడా విడుదల కాలేదు. పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుంది. నైజాం నవాబ్ గా అల్లు అర్జున్ అవతరించాడు అనేది లేటెస్ట్ రిపోర్ట్. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప విడుదలకు సమయం దగ్గర పడుతుంది. పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దీంతో బిజినెస్ మొదలైపోయింది. వివిధ ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ హక్కుల కోసం పోటీ పడుతున్నారు. కాగా నైజాం ఏరియా పుష్ప 2 హక్కుల కోసం బడా డిస్ట్రిబ్యూటర్స్ రేసులో ఉన్నారట.
కేవలం నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 100 కోట్లు పలుకుతున్నాయట. ఈ మొత్తం చెల్లించేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్ ఆసక్తి చూపడం విశేషం. పుష్ప 2 నిర్మాతలు గా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ అయితే ఇంకా డీల్ క్లోజ్ చేయలేదట. అందుకు కారణం కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెట్టారు. వారు సొంతగా విడుదల చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. బయట డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మినా, సొంత విడుదల చేసినా… పుష్ప 2 నైజాం హక్కులు ధర రూ. 100 కోట్ల పైమాటే అట.
ఇది ఆర్ ఆర్ ఆర్, సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. ఇప్పటి వరకు నైజాం థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉంది. దాదాపు రూ. 70 కోట్లకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ హక్కులు అమ్మడుపోయాయి. ఇక సలార్ హక్కులు రూ. 60 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ రెండు చిత్రాల రికార్డ్స్ పుష్ప 2 అధిగమించడం ఖాయంగా అనిపిస్తుంది.
అటు బాలీవుడ్ లో కూడా పుష్ప 2 పై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 హిందీ వెర్షన్ ఫస్ట్ డే రూ. 40-45 కోట్లు వసూలు చేస్తుందని స్థానిక మీడియా అంచనా వేస్తుంది. అలాగే ఫుల్ రన్ లో రూ . 500 కోట్లు వసూళ్లు కొల్లగొట్టడం అనివార్యం అంటున్నారు. పుష్ప 2 మేకర్స్ అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బాక్సాఫీస్ బరిలో దిగనున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు.