MLA Raja Singh Arrested: ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ను తన విద్వేష వ్యాఖ్యలతో వాతావరణం చెడగొట్టేశాడు బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్. పాతబస్తీలో ఇప్పుడు కర్ఫ్యూ కొనసాగుతోంది. అందరూ రాజాసింగ్ ఇంటిపై దండెత్తుతున్న పరిస్థితి ఉంది. రాజాసింగ్ లపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే నిన్ననే అరెస్ట్ చేసిన పోలీసులకు షాకిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే మరోసారి పాత కేసులు బయటకు తీసి మరీ రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. గోషా మహల్ బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మళ్లీ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇప్పటికే నిన్న ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41ఏ సీఆర్పీపీసీ నోటీసులు ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినందుకు ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
Also Read: Lakshmi Parvathi- Junior NTR: చంద్రబాబు కు షాక్ …. టీడీపీ పగ్గాలు జూ ఎన్టీఆర్ చేతికి
గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్ హట్ పోలీసులు 41ఏ సీఆర్పీపీసీ నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజాసింగ్ పై నమోదైన కేసుల్లో ఈ నోటీసులు జారీ చేశారు. అరెస్ట్ కు ముందు రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపచేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇక రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళుతున్నది స్పష్టం చేయలేదు. కోర్టులో హాజరుపరుస్తారా? విచారిస్తారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ఒకసారి తప్పించుకున్న రాజాసింగ్ ను వదలకుండా తెలంగాణసర్కార్ జైలుకు పంపడానికి రెడీ అయ్యింది. హైదరాబాద్ లో ఉద్రిక్తతలు తగ్గాలంటే రాజాసింగ్ ను లోపల ఉండాలనే ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read:Bandi Sanjay: హైదరాబాద్ లో మత ఘర్షణలపై బండి సంజయ్ గుసగుసలు.. వీడియో వైరల్
[…] […]