Punith Rajkumar: ప్రముఖ కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని వదిలి చాలా కాలం అయినా ఇంకా ఆయన జ్ఞాపకాలు కుటుంబసభ్యులతో పాటు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. పవర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన పునీత్.. సినీరంగంలో దూసుకుపోతున్న సమయంలో.. అతని ఆకస్మిక మరణం భారతీయ సినిమా పరిశ్రమను కలిచిపేసింది. అయితే, ఇటీవలే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన మరణానికి ముందే తన తండ్రి రాజ్‌కుమార్, పూర్వికులు నివసించిన గానానూర్లోని ఇంటిని మ్యూజియంగాా మార్చాలని పునీత్ అనుకున్నారట.
కానీ, ఈ ఏడాది భారీగా వర్షాలు పడటంతో ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో.. ఆ ఇంటిని అందంగా పునరుద్ధరించి ఓ మ్యూజియమ్‌గా మార్చాలనుకున్నారు పునీత్. ఈ క్రమంలోనే తను మరణించే కొద్ది రోజుల ముందు ఇంటిని సందర్శించి అందుకు తగ్గ మరమ్మత్తులు చేయించడం మొదలుపెట్టారు. కానీ, మధ్యలోనే హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.
Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్ యూనివర్స్.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్
అయితే, పునీత్ సంకల్పాన్ని వృధా కానివ్వకుండా రాజ్‌కుమార్ మేనల్లుడు గోపాల్ ముందుకొచ్చారు. శిథిలమైన ఇంటిని శరవేగంగా పునరుద్ధరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని.. రెండు నెలల్లో ఇల్లు పునరుద్ధరణ పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ ఊరితో పునిత్కు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని.. అలాంటిది ఇల్లు శిథిలావస్థ స్థితిలో ఉండటం బాధగా అనిపించి.. దీన్ని పునరుద్ధరణ బాధ్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Also Read: విక్కీకోసం పంజాబీ నేర్చుకున్న కత్రినా.. ఎందుకో తెలుసా?
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More