Homeఎంటర్టైన్మెంట్Punith Rajkumar: పునీత్​ రాజ్​కుమార్​ ఇంటికి రాంచరణ్​!

Punith Rajkumar: పునీత్​ రాజ్​కుమార్​ ఇంటికి రాంచరణ్​!

 

Punith rajkumar: కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త వినగానే లక్షలాది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు కర్ణాటక సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్​ ఇతర సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయనాయకులు పునీత్​కు ఘన నివాళి అర్పించారు. ఇక నందమూరి కుటుంబానికి పునీత్​ అప్తుడన్న విషయం తెలిసిందే. ఆయన మరణవార్త విన్న బాలకృష్ణ, ఎన్టీఆర్​ తీవ్ర మనస్తాపం చెందారు. పునీత్​ మరణం సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కాగా, బుధవారం మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ పునీత్​ రాజ్​కుమార్​ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం 11 గంటలకు పునీత్​రాజ్​కుమార్​ గృహానికి చేరుకుని నివాళి అర్పించారు.  రోజూలాగే శుక్రవారం కూడా పునీత్​ రాజ్​కుమార్​ జిమ్​లో వర్క్​ఔట్స్​ చేస్తున్నారు. అదే  సమయంలో ఛాతి నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఫ్యామిలి డాక్టర్​ను సంప్రదించారు. అయితే, వెంటనే ఆసుపత్రిలో చేరమని సలహా ఇచ్చారు డాక్టర్​. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా మరణించారు.

మరణించే ముందు రోజు కూడా ఆయన అన్న శివరాజ్​కుమార్​ హీరోగా నటించిన భజరంగి2 సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు వెళ్లారు. ముఖ్య అతిథిగా వచ్చిన యష్​తో కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఇంతలోనే ఆయన మరణ వార్త యావత్ సినీలోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. 45 స్కూల్స్​, 26 ఆర్ఫనేజ్​లు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, 1800 పిల్లలకు ఉచిత చదువుతో పాటు, చనిపోయాక తన రెండు కళ్లను కూడా దానం చేసిన గొప్పవ్యక్తి పునీత్​ రాజ్​కుమార్​.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular