Kalki 2: కల్కి 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత… ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!

Kalki 2: దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని భారీగా తెరకెక్కించనున్నారు. దాదాపు మూడు భాగాలుగా కల్కి విడుదల కానుందని సమాచారం. ఈ క్రమంలో కల్కి 2 షూటింగ్ కూడా కొంత మేర పూర్తి చేశారట.

Written By: Gopi, Updated On : June 29, 2024 4:29 pm

producer Ashwini dutt gave a crazy update on Kalki 2

Follow us on

Kalki 2: ప్రభాస్ నటించిన కల్కి 2829 ఎడి బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ వసూళ్లు రెండు రోజుల్లోనే మూడు వందల కోట్లకు చేరువయ్యాయి. మరో రెండు రోజుల వీకెండ్ ఉంది. కల్కి భారీ ఫిగర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కల్కి దర్శక నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాగా కల్కి 2 అప్డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపారు నిర్మాత అశ్వినీ దత్.

దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని భారీగా తెరకెక్కించనున్నారు. దాదాపు మూడు భాగాలుగా కల్కి విడుదల కానుందని సమాచారం. ఈ క్రమంలో కల్కి 2 షూటింగ్ కూడా కొంత మేర పూర్తి చేశారట. కల్కి 2 చిత్రీకరణ 60% పూర్తి చేసినట్లు చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు నిర్మాత అశ్వినీ దత్. ఈ మేరకు మీడియాతో ఆయన పార్ట్ 2 పై కీలక కామెంట్స్ చేశారు. కల్కి షూటింగ్ అరవై శాతం పూర్తి చేశాము. కొన్ని మేజర్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ఇక కల్కి 2 విడుదల ఎప్పుడనేది మేము నిర్ణయించలేదు… అని చెప్పుకొచ్చాడు.

అశ్వినీ దత్ మాటల ప్రకారం వీలైనంత త్వరగా కల్కి 2 వచ్చేస్తుంది. కల్కి 3కి మాత్రం సమయం పట్టే అవకాశం. కల్కి 2 లో అసలు కథ ఉంటుందని సమాచారం. కాబట్టి నాగ్ అశ్విన్ ప్రేక్షకులను పార్ట్ 2 తో మరింత థ్రిల్ కి గురి చేయడం ఖాయం. కల్కి మూవీ మహాభారతం ఆధారంగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ. భవిష్యత్ మహాభారతాన్ని వినూత్నంగా నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు.

కల్కి మూవీలో ప్రభాస్ భైరవ అనే రోల్ చేశాడు. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ అదరగొట్టాడు. ఇక కమల్ హాసన్ రోల్ మరింత సర్ప్రైజ్ చేసింది. కల్కి జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, శోభన ఇతర కీలక పాత్రల్లో నటించారు.