Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తానికి భారత్ ఫైన్ లో అడగుపెట్టింది. సౌతాఫ్రికా దాదాపు ఇండియాపై గెలిచిన మ్యాచు లు తక్కువ. అందువల్ల ఇదే సరైన సమయం అనుకొని కప్ తీసుకురావాలని భారత క్రీడాభిమానులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నారు. ఈ తరుణంలో జట్టులోని ఇద్దరు ప్లేయర్లపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే?
టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టు జోరుమీదుంది. దాదాపు అందరు క్రీడాకారులు రాణించారు. కానీ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు మాత్రం ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనిపించలేదు. దీంతో వీరిద్దరు కనీసం ఫైనల్ మ్యాచ్ లోనైనా తమ ప్రతిభ చూపించాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు సోషల్ మీడియా వ్యాప్తంగా కొందరు వీరిద్దరిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. కానీ వీరికి సీనియర్ క్రికెటర్లు మద్దతు ఇస్తున్నారు.
అయితే వీరిలో ఒకరైన రవీంద్ర జడేజాపై సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్స్ చేశాడు. జడేజా పై ఆట తీరుపై ఎటువంటి అనుమానం లేదన్నారు. అతడు సమయాన్ని బట్టి తన ప్రదర్శన అత్యుత్తమంగా ఉంటుందని అన్నాడు. జడేజా బ్యాటింగ్ పర్ఫామెన్స్ లేకున్నా.. వికెట్లు తీసుకుంటున్నాడన్నారు. ఇతరుకు పరుగులు ఇవ్వడం లేదన్నారు. కనీసం 20 నుంచి 30 పరుగులు కాపాడుతాడని చెప్పారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆటతీరుపై కూడా గవాస్కర్ స్పందించారు. కోహ్లి క్రీజులో ఉన్నప్పుుడు కుదురుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతీ సారి దూకుడు కాకుండా బౌలర్ల ప్రవర్తనను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. అయితే కోహ్లి ఒక్కసారి రిథమ్ లోకి వస్తే ఇక అతడిని ఆపడం కష్టం. గత మ్యాచుల్లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే రేంజ్ లో కోహ్లి కూడా సెట్ అవుతాడు అని అన్నారు.