Priyanka Chopra : #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న ‘వారణాసి’ చిత్రం పై పాన్ ఇండియా లెవెల్ లో మూవీ లవర్స్ ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుండి ఈ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అభిమానులు , ప్రేక్షకులు మెంటలెక్కిపోతున్నారు. ఇకపోతే నేడు ఈ మూవీ టీం ఆడియన్స్ కి ఇచ్చిన ఒక స్వీట్ సర్ప్రైజ్ అదిరిపోయింది. నేడు ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా పుట్టినరోజు కావడంతో , మేకర్స్ ఆమెకు సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఆమె లుక్స్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఫస్ట్ లుక్ లో చీర కట్టుకొని , చేతిలో గన్ పట్టుకొని , యాక్షన్ సన్నివేశం చేస్తూ చాలా గంభీరంగా కనిపించింది ప్రియాంక చోప్రా.
కానీ నేడు విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం ఆమె చాలా స్టైలిష్ గా కనిపించింది. ఈ పోస్టర్ లోని ఆమె లుక్ ని చూస్తుంటే, ఇందులో ఆమె డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో చేసినట్టుగా అనిపిస్తుంది. నేడు విడుదల చేసిన పోస్టర్ లో ఆమె ముఖం లోని హావభావాలు విలన్ ని తలపించేలా ఉన్నాయి. అంటే ఈమె ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, ఇందులో ప్రియాంక చోప్రా హీరో ని నమ్మించి , క్లైమాక్స్ లో విలన్ వైపు చేరి వెన్నుపోటు పొడిచే పాత్రలో కనిపించిందని అంటున్నారు. ఇక నేడు విడుదల చేసిన పోస్టర్ లోని లుక్, ‘వారణాసి’ లో ఒక స్టైలిష్ పాటకు సంబంధించినది అట.
దీనిని బట్టీ రాజమౌళి సైన్స్ ఫిక్షన్ , యాక్షన్ అడ్వెంచర్ , రామాయణం లను మిక్స్ చేసి , తనదైన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి , ప్రేక్షకులకు అందించబోతున్నారని అర్థం అవుతోంది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ లుక్ ని ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఏ హీరోకి అయినా తన అభిమాన హీరో ని దేవుడి గెటప్ లో చూడడం ఒక విజువల్ ట్రీట్ లాంటిది. అలాంటిది రాజమౌళి మార్క్ టేకింగ్ తో , సూపర్ స్టార్ మహేష్ బాబు ని శ్రీ రాముడిగా చూపిస్తే ఇండియా వైడ్ గా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పటి నుండే ఊహించుకోండి.
