మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి, బాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు హాలీవుడ్ లోనూ జెండాపాతి గ్లోబల్ బ్యూటీగా సత్తా చాటుతోంది. ఆకర్షించే అందంతో.. ఆకట్టుకునే యాక్టింగ్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్రియాంక.
దాదాపు రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా సత్తాచాటిన ప్రియాంక.. ఆ తర్వాత నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇంగ్లీష్ లో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
ఈ క్రమంలోనే తనలోని బిజినెస్ ఉమన్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. న్యూయార్క్ లో ఈ అమ్మడు రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ హోటల్ ద్వారా.. ఫారెన్‌లో ఇండియన్ వంటకాలను అందుబాటులోకి తెస్తోందీ బ్యూటీ.
అటు కెరీర్ పరంగా.. ఇటు బిజినెస్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం వదిలిపెట్టదు ఈ బ్యూటీ. తన కెరీర్, పర్సనల్ విషయాలకు సంబంధించిన అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటోంది.
అయితే.. 40 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఈ అమ్మడు తాజాగా ఆస్ట్రేలియా మేగజైన్ ‘వోగ్’ కోసం చేసిన ఫొటో షూట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లోదుస్తులు లేకుండా.. వైట్ డ్రస్ వేసుకొని ఎద అందాలను పారబోస్తోంది. ప్రియాంక బ్రా లెస్ ఫొటో చూసిన నెటిజన్లు.. పారబోసిన అందాలను ఏరుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.