https://oktelugu.com/

రఘారామ డిశ్చార్జీతో కేసు మరో మలుపు తిరగనుందా..?

ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇటీవల ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆ తరువాత ఏయిమ్స్ లో చికిత్స తీసుకొని ఇంటికెళ్లారు. అయితే ప్రభుత్వ దూషణల కింద పోలీసులు అరెస్టు చేసిన ఎంపీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రిమాండ్లో ఉన్నట్లేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే రఘురామ మాత్రం బెయిల్ బాండ్లను […]

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2021 10:57 am
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇటీవల ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆ తరువాత ఏయిమ్స్ లో చికిత్స తీసుకొని ఇంటికెళ్లారు. అయితే ప్రభుత్వ దూషణల కింద పోలీసులు అరెస్టు చేసిన ఎంపీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రిమాండ్లో ఉన్నట్లేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే రఘురామ మాత్రం బెయిల్ బాండ్లను కింది కోర్టులో సమర్పించకుండా ఢిల్లీ వెళ్లడంపై మరో చర్చకు దారి తీస్తోంది. దీనిపై ప్రభుత్వం తరుపున న్యాయవాదులు కోర్టును సంప్రదించనున్నట్లు సమాచారం.

    గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ నిన్న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. అయితే బెయిల్ బాండ్లు సమర్పించకుండా, ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ ఎలా వెళుతారని ప్రభుత్వ తరుపున న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వాళ్లు కోర్టును ఆశ్రియించనున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా జ్యూడీషియల్ రిమాండ్లో ఉన్నట్లే వారు అనుకుంటున్నారు.

    అయితే ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన తరువాత పది రోజుల్లో బెయిల్ కు సంబంధించిన బాండ్లను గుంటూరు సీఐడీ కోర్టులు సమర్పించవచ్చని కోర్టు తెలిపిందని రఘురామ తరుపున న్యాయవాదులు అంటున్నారు. అందుకే ఆయన డిశ్చార్జీ అయ్యారని, డిశ్చార్జీ అయితేనే అందుకు సంబంధించిన బాండ్లు ఇస్తారని వారంటున్నారు. ఈమేరకు డిశ్చార్జీ సమ్మరిని తీసుకొని గుంటూరు సీఐడీ కోర్టులో షూరిటీ బాండ్లను కలిపి దాఖలు చేయనున్నారు.

    అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాదులు మాత్రం కోర్టును సైతం ధిక్కరించి కస్టడీ నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేసు ఎటు మలుపు తిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీఐడీ కోర్టు ఎలా స్పందిస్తుందో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.