Tollywood: ప్రస్తుతం ఇండస్ట్రీ లో కొంతమంది డైరెక్టర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా ప్రశాంత్ అనే పేరు ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ లో బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేసి ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ మరొక సక్సెస్ ని అందుకోడానికి రెడీగా ఉన్నాడు.ప్రశాంత్ అనే పేరు ఉన్న డైరెక్టర్ లకి ఇండస్ట్రీ బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ లు సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటుంటే రీసెంట్ గా బిగ్ బాస్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా అదే పేరుతో ఉండటం విశేషం…
ప్రశాంత్ అనే పేరు కి ఇప్పుడు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్ తో ఏ విధంగా సక్సెస్ అందుకున్నాడో ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా అనే విషయం మీద కూడా చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సిరీస్ లతో చాలా మంచి సక్సెస్ లను అందుకున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ కూడా ఇంతకుముందు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.
అయితే తెలుగులో ఇంతవరకు ఎవరు చేయని జాంబీ రెడ్డి లాంటి ఒక డిఫరెంట్ కథ తో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో కనక మంచి విజయాన్ని అందుకుంటే ప్రశాంత్ వర్మకి కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి అవకాశాలు రావడమే కాకుండా తను ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు ఆని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రశాంత్ నీల్ లాగే ప్రశాంత్ వర్మ కూడా సక్సెస్ కొడతాడా లేదంటే హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరుస్తాడా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే ప్రశాంత్ అనే పేరుకి ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది దాన్ని బట్టి ప్రశాంత్ అనే పేరు ఉన్న ఎవరైనా సరే ఇండస్ట్రీలో తమ లక్కు ని పరీక్షించుకొండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు…