Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Overseas Preview Talk: 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఓవర్సీస్ ప్రివ్యూ...

Ustaad Bhagat Singh Overseas Preview Talk: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఓవర్సీస్ ప్రివ్యూ షో పూర్తి.. టాక్ ఏంటంటే!

Ustaad Bhagat Singh Overseas Preview Talk: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఒక్కో ప్రాంతం లో ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతం ఓవర్సీస్ లో పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభం అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొదలయ్యాయి. ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో నేడు సాయంత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో రీసెంట్ గానే లండన్ లో కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారట మేకర్స్. అక్కడే రీ రికార్డింగ్ మిక్సింగ్ చివరి భాగం కూడా జరిగిందట. మరి ఆ ప్రివ్యూ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఆ ప్రివ్యూ షో వివరాలు పూర్తిగా చూద్దాం.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

సినిమా టాక్ విషయానికి వస్తే ఫస్ట్ కాస్త ఎంటర్టైన్మెంట్ తో , మధ్యలో రెండు మూడు ఎలివేషన్ సీన్స్ తో , పవర్ ఫుల్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో పూర్తి అవుతుందని. కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినప్పటికీ, రొటీన్ గా అనిపిస్తాయని, కానీ చాలా ఎంగేజింగ్ గానే తీసారని తెలుస్తోంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కమర్షియల్ మూవీ లవర్స్ కి బాగానే నచ్చుతుంది. హరీష్ శంకర్ రాసిన కొన్ని డైలాగ్స్ సూపర్ అనిపించాయని, మరికొన్ని డైలాగ్స్ ఎందుకో ఓవర్ గా అనిపించిందని అంటున్నారు. కామెడీ సీన్స్ కూడా కొన్ని పేలాయి కానీ, మరికొన్ని క్రింజ్ గా అనిపించాయని, ఓవరాల్ గా మామూలు ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, బాగుంది అనే రేంజ్ లో అనిపిస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఆరంభం నుండి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో నింపేసారని, ఆయన అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు.

ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయని, శ్రీలీల ఈ చిత్రానికి మైనస్ అవుతుందేమో అని అభిమానులు భయపడేవారు కానీ, ఆమె ఈ చిత్రానికి చాలా వరకు ప్లస్ అయ్యిందని, ఆమె క్యారెక్టర్ డీసెంట్ గా ఉందని అంటున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు తమిళంలో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి ‘ కి రీమేక్ అంటూ ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది , కానీ అందులో ఎలాంటి నిజం లేదట. ఇది పూర్తిగా కొత్త స్టోరీ అంటూ ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్. ఓవరాల్ గా సినిమా మొత్తం మీద 4 యాక్షన్ బ్లాక్స్ , రెండు పాటలు ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయాయి. ఇవే ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి విడుదల తర్వాత ఎలాంటి టాక్ చెప్తారు అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version