Prashanth Neel , NTR
Prashanth Neel and NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన సినిమాలను చేస్తూ వస్తున్నప్పటికి ఆయనకు మాస్ లో మాత్రం మంచి గుర్తింపైతే ఉంది. మరి ఇప్పుడు రాబోతున్న సినిమాలతో కూడా మాస్ లో తన ఫాలోయింగ్ ను రెట్టింపు చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)… ఈయన చేసిన కేజిఎఫ్ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా ఇండియాలో టాప్ ఫైవ్ డైరెక్టర్లలో తనని కూడా ఒకడిగా నిలబెట్టింది. మరి ఇదిలా ఉంటే ఆయన ఎన్టీఆర్ (NTR) తో చేస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ ఒక మాట ఇచ్చారట. తప్పకుండా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపిస్తానని చెప్పడంతో ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ఎన్టీఆర్ కి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా వినిపించారట. ఇందులో చాలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉండటంతో ఎన్టీఆర్ పక్కాగా ఈసారి మనం ఇండస్ట్రీ హిట్టు కొట్టబోతున్నాం అనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. కేజిఎఫ్, సలార్ సినిమాల్లో ఎలివేషన్స్ మామూలు రేంజ్ లో ఉండవు. వాటిని మించి ఈ సినిమాలో ఎలివేషన్స్ ఉండబోతున్నట్టుగా ప్రశాంత్ నీల్ తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మరి ఈ సినిమా మొత్తానికైతే సగటు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అభిమానిని సైతం అంటూ మెప్పిస్తుంది అనే కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొంతవరకు వెనుకబడిపోయాడు. ఇప్పటివరకు ఆయనకు ఇండస్ట్రీ హిట్ లేకపోవడం వల్ల ఇతర హీరోలతో పోల్చుకుంటే ఆయన కొంతవరకు డల్ అవుతున్నాడనే చెప్పాలి.
మరి ఈ సినిమానే ఆయన కెరియర్ ను నిలబెడుతుందంటూ అలాగే ఇప్పటివరకు వస్తున్న విమర్శలన్నింటికి చెక్ పెట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి అందులో ఎన్టీఆర్ కి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంటుంది. ఆయన డాన్స్ లో కానీ నటనలో కానీ తనదైన పరిణీతిని చూపిస్తూ ప్రేక్షకులందరిని కట్టిపడేస్తూ ఉంటాడు… అందుకే ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థానమైతే ఉందనే చెప్పాలి…