Prabhas
Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక బాహుబలి (Bahubali) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ప్రభాస్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా నేపధ్యంలో సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి మధ్యలో కొన్ని ప్లాప్ లు వచ్చిన కూడా తను వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సలార్(Salaar),కల్కి(Kalki) సినిమాలతో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇప్పుడు హ్యాట్రిక్ విజయాల మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమాని పూర్తిచేసే పనిలో టను చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయాల్సిన స్పిరిట్ (Spirit) సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఏర్పడుతుందట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి నటి అయిన మధుబాల నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె రోజా (Roja) సినిమాతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికి ఆమెకు అంత మంచి గుర్తింపైతే రాలేదు.
Also Read : ప్రభాస్ కంటే చిన్నదే అయినప్పటికి తనకి తల్లి గా నటించిన స్టార్ హీరోయిన్…
మరి మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడి సినిమాలో క్యారెక్టర్ చేస్తే వాళ్లకు మంచి గుర్తింపైతే లభిస్తుంది. అందుకోసమే ఆమె ఆ క్యారెక్టర్ ని పిక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగ ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఉన్నటువంటి బోల్డ్ కంటెంట్ అయితే ఈ సినిమాలో ఉండబోదనే విషయం చాలా స్పష్టంగా తెలూస్తోంది.
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి తన మదర్ కి తనకి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని తెలియజేసే సినిమాగా ఈ మూవీ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇక ఫుల్ లెంత్ ఎమోషనల్ డ్రామా సినిమాగా కూడా ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి నటుడు సాధిస్తున్న విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సందీప్ రెడ్డివంగ కూడా వరుసగా విజయాలను సాధిస్తూ వస్తున్నాడు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…
Also Read : ప్రభాస్ తన ఫేవరెట్ డైరెక్టర్ ను పక్కన పెట్టడా..?