https://oktelugu.com/

Prashanth Neel and NTR : ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ మూవీ షూట్ లో జాయిన్ అయిన స్టార్ హీరో…

సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఏ హీరో ఏ పొజిషన్ లో ఉంటాడో ఎవరు చెప్పలేరు. ఈరోజు స్టార్ హీరోగా వెలుగొందుతున్న నటుడు సైతం రేపు ప్లాప్ ను మూటగట్టుకొని తమ ఇమేజ్ ను డామేజ్ చేసుకోవచ్చు. ఏమాత్రం క్రేజ్ లేని హీరోలు సైతం సూపర్ సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోలుగా మారిపోవచ్చు...ఇక్కడ ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరమైతే లేదు...

Written By: , Updated On : February 21, 2025 / 08:05 AM IST
Prashanth Neel , NTR

Prashanth Neel , NTR

Follow us on

Prashanth Neel and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయన వరుసగా ఏడు విజయాలను అందుకొని ఏ స్టార్ హీరోకి సాధ్యం కానీ రీతిలో సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు… ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం ఆయన చేసిన ‘దేవర ‘ (Devara) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేదు. దాంతో తను ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలని వీలైతే ఇండస్ట్రీ హిట్ కొట్టాలని తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే నిన్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇందులో ఒక భారీ ధర్నా సీన్ ను ప్రశాంత్ నీల్ 2500 మందితో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో ఒక మలయాళ స్టార్ హీరో కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్న జరిగిన ఈ సినిమా షూట్ లో ఆ నటుడు పాల్గొన్నారట. ఇంతకీ ఆయన ఎవరు అనేది స్పష్టంగా తెలియజేయడం లేదు కానీ మొత్తానికైతే ఆ నటుడితో ఈ సినిమాలో ఒక అద్భుతాన్ని చేయించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు పాజిటివ్ గా చేస్తున్నాడా లేదంటే నెగెటివ్ పాత్ర చేస్తున్నాడా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాకు ఉపయోగపడే పాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో ఇప్పటివరకు సరైన సక్సెస్ అయితే పడటం లేదు. కాబట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోగా నిలువలనే ప్రయత్నం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కి ప్రశాంత్ నీల్ మంచి బూస్టప్ ని ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు.

మరి ఇలాంటి ప్రశాంత్ నీల్ మరోసారి భారీ విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన డైరెక్షన్ లో వచ్చిన కే జి ఎఫ్, సలార్ సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తు భారీ విజయాలుగా నిలిచాయి… ఇక వాటితరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…