UPI Rewards
UPI Rewards : UPI ద్వారా డిజిటల్ చెల్లింపులను పెంచడానికి కేంద్రం మరింతగా కృషి చేస్తోంది. డిజిటల్ చెల్లింపులు దేశంలో అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా లేవు. కొన్ని ప్రాంతాలలో డిజిటల్ చెల్లింపులు ఆశించినంత స్థాయిలో లేవు. డిజిటల్ చెల్లింపుల వల్ల వినియోగదారుల నుంచి వ్యాపారులకు లేదా వ్యక్తుల నుంచి వ్యక్తులకు నేరుగా నగదు బదిలీ అవుతుంది. క్షణాల వ్యవధిలోనే నగదు బట్వాడా అవుతుంది. దీనివల్ల మోసాలకు.. ఇతర చట్ట విరుద్ధమైన వ్యవహారాలకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కేంద్రం UPI ద్వారా చెల్లింపులను ప్రోత్సహిస్తున్నది. అయితే దేశంలో UPI ద్వారా చెల్లింపులు మరింత పెరగాలని కేంద్రం భావిస్తున్నది.. ఈక్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒక పథకానికి శ్రీకారం చుట్టింది.. యూపీఐ ద్వారా లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడానికి 1500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ స్కీమ్ లో రెండువేల కంటే తక్కువ విలువైన UPI లావాదేవీల పై కేంద్రం మరింతగా ప్రోత్సాహకాలు అందిస్తుంది. ప్రతి UPI లావాదేవీ పై 0.15% వడ్డీని ప్రోత్సాహంగా కేంద్రం ఇస్తుంది. దీనిద్వారా చిన్న వ్యాపారులకు, దుకాణదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.. ఉదాహరణకు ఒక వ్యాపారి UPI ద్వారా 1,500 అందుకున్నప్పుడు.. అతడికి 0.15% శాతం చొప్పున రూ. 2.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ పథకం గడువు మార్చి 31 తో ముగుస్తుంది.
Also Read : ఏ యూపీఐని అధికంగా వాడుతున్నారో తెలుసా.. మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న కంపెనీ ఏదంటే ?
పారదర్శకత పెరుగుతుంది
ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెరగడంతో UPI లావాదేవీలు మరింత ఎక్కువై తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల లావాదేవీలు పెరుగుతాయని.. చిన్న వ్యాపారులు.. రిటైల్ షాపులు.. సేవల సంస్థలు ఈ పథకాల్లో భాగస్వామ్యులు అవుతాయని కేంద్రం భావిస్తుంది..UPI పేమెంట్ ద్వారా వ్యాపారం సాధించడం వల్ల వ్యాపారులు తక్షణమే నగదు సొంతం చేసుకోవచ్చు. లావాదేవీలను ట్రాక్ చేయడం కూడా వారికి ఈజీ అవుతుంది. వ్యాపారంలో ఎటువంటి అనుమానాలకు కూడా అవకాశం ఉండదు. డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయి.. అయితే వ్యాపారులు UPI ద్వారా రెండువేల కంటే తక్కువ విలువైన లావాదేవీలు నిర్వహించినప్పుడు.. వారి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.. దీనివల్ల చిన్న దుకాణదారులు, రిటైల్ షాప్ నిర్వాహకులు తమ వ్యాపారాలను మరింతగా విస్తృతం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందువల్లే కేంద్రం డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాలలో ఆర్థిక లావాదేవీలను.. ఇతర వ్యవహారాలను పూర్తిగా డిజిటల్ వైపు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో పెరిగి పోయిన సైబర్ నేరాలను నిరోధించాలని కేంద్రం యోచిస్తోంది.
Also Read : జనవరి 1నుంచి యూపీఐ చెల్లింపుల్లో వచ్చిన మార్పులివే.. వాటిని గమనించారా ?