ప్రణీత గొప్ప మనసుకు సలాం చేస్తున్న నెటిజన్లు

దేశంలో లాక్డౌన్ వల్ల సామన్యులు, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు తమకు తోచినవిధంగా సాయమందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థిత్లుల్లో హీరోయిన్ ప్రణీత స్వయంగా సాయమందిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ఎంతోమంది సెలబ్రెటీలు చిన్నసాయంచేసి గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటుంగా ప్రణీత మాత్రం వాటికి దూరంగా ఉంటుంది. తనకు తోచినవిధంగా పేదవారికి సాయం చేస్తుంది. సీని కార్మికుల కోసం ప్రారంభించిన సీసీసీ మనకోసం ఛారిటీకి […]

Written By: Neelambaram, Updated On : May 23, 2020 7:24 pm
Follow us on


దేశంలో లాక్డౌన్ వల్ల సామన్యులు, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు తమకు తోచినవిధంగా సాయమందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థిత్లుల్లో హీరోయిన్ ప్రణీత స్వయంగా సాయమందిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ఎంతోమంది సెలబ్రెటీలు చిన్నసాయంచేసి గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటుంగా ప్రణీత మాత్రం వాటికి దూరంగా ఉంటుంది. తనకు తోచినవిధంగా పేదవారికి సాయం చేస్తుంది. సీని కార్మికుల కోసం ప్రారంభించిన సీసీసీ మనకోసం ఛారిటీకి ప్రణీత లక్ష రూపాయల విరాళం అందించింది. అంతేకాకుండా తనవంతు సాయం ఒక్కో కుటుంబానికి 2వేల చొప్పున లక్ష రూపాయాల సాయం చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇటీవల ప్రణీత పేదలకు స్వయంగా వంటచేసి పేదలకు భోజనాన్ని పంచిపెట్టింది.

లాక్డౌన్ 3.0లో భాగంగా కొన్ని సడలింపులతో ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆటోడ్రైవర్లకు ఉపాధి లభించింది. రెండునెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ప్రణీత తనవంతు సాయమందించింది. బెంగుళూరులోని 100మంది ఆటోడ్రైవర్లకు శానిటైజర్స్ పంపిణీ చేసింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను వేరుచేసేలా షీట్స్ ను పంపిణీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రణీత తన ట్వీటర్లో పోస్టు చేసింది. ఆటో డ్రైవర్లకు ప్రణీత చేసిన సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.