వివాదాస్పదమైన టిటిడి నిర్ణయం..!

రాష్ట్రంలో ప్రభుత్వం ఓ వైపు విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టింది. తొలి విడతగా రూ. 300 కోట్లు ఆర్జించాలని చూస్తున్నా, మొత్తంగా రూ. 4 వేల కోట్ల విలువైన ఆస్తులు అమ్మాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం దాతలు ఇచ్చిన ఆస్తులు వేలానికి సిద్ధమైంది. శ్రీవారికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్మేందుకు టీటీడీ అడుగులు […]

Written By: Neelambaram, Updated On : May 23, 2020 6:46 pm
Follow us on


రాష్ట్రంలో ప్రభుత్వం ఓ వైపు విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టింది. తొలి విడతగా రూ. 300 కోట్లు ఆర్జించాలని చూస్తున్నా, మొత్తంగా రూ. 4 వేల కోట్ల విలువైన ఆస్తులు అమ్మాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం దాతలు ఇచ్చిన ఆస్తులు వేలానికి సిద్ధమైంది. శ్రీవారికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్మేందుకు టీటీడీ అడుగులు వేస్తోంది. తమిళనాడులో 23 చోట్ల ఉన్న ఆస్తులను విక్రయించనుంది. ఈ ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా టిటిడి పేర్కొంది. ఆస్తుల విక్రయానికి టీటీడీ ఎనిమిది కమిటీలను వేసింది. బహిరంగంగానే విక్రయించాలని నిర్ణయించింది. ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది.

శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ రూ. 670 కోట్ల ఆదాయాన్ని టిటిడి కోల్పోయింది. జీతాలు చెల్లించలేమని పేర్కొంది. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏ మొచ్చిందని మండిపడుతున్నారు. బ్యాంక్ డిపాజిట్ ఉండగా ఆస్తుల వేలం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన కూడా హెచ్చరించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ విషయాన్ని ఖండించారు. టిటిడి ఆస్తులు అమ్మకాన్ని నిలిపివేయాలని సీఎంకు లేఖ రాశారు.