Prabhas
Prabhas : టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోలలో ఒకరు శర్వానంద్. అప్పట్లో నేచురల్ స్టార్ నాని కి పోటీ అంటే ఈయనే. ఇప్పుడు ఎలా అయితే నాని, విజయ్ దేవరకొండ ని ఒక లీగ్ లో పెట్టి ట్రేడ్ పోలుస్తున్నారో, అప్పట్లో నాని(Natural Star Nani), శర్వానంద్(Sharwanand) ని అలా పోల్చేవారు. కానీ శర్వానంద్ పూర్తిగా ట్రాక్ తప్పాడు అనే వాస్తవం. కమర్షియల్ సినిమాలు చేసుంటే సక్సెస్ అయ్యేవాడేమో, కానీ శర్వానంద్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అవి నచ్చవు కూడా. అందుకే ఈ హీరోకి సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇదంతా పక్కన పెడితే శర్వానంద్ గతం లో ‘కో అంటే కోటి’ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కూడా. స్వతహాగా కోటీశ్వరుడు అయిన శర్వానంద్ కొనేయాలి అనుకుంటే హైదరాబాద్ నే కొనేయగలడు అని ఆయన స్నేహితులు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు.
Also Read : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి అందాల బ్యూటీ…
కానీ తన తల్లిదండ్రులు ఎంత పెద్ద కోటీశ్వరులు అయినప్పటికీ తన సొంత కాళ్ళ మీదనే నిలబడాలని అనుకున్నాడు. అందులో భాగంగా సినీ రంగంలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అవి ఫ్లాప్ అయ్యాయి, దీంతో ఆయన నిర్మాతగా మారి ఈసారి పెద్ద సక్సెస్ కొట్టాలి అనే కసితో తన తల్లి నగలను కూడా తాకట్టు పెట్టి ‘కో అంటే కోటి’ చిత్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. శర్వానంద్ పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి. దీంతో తాకట్టు పెట్టిన ఆయన తల్లి నగలు అలాగే ఉండిపోయాయి. స్నేహితుల దగ్గర చేసిన అప్పులను కూడా తీర్చలేకపోయాడు. దీంతో ఆయనతో స్నేహితులు మాట్లాడడం కూడా మానేశారట. డబ్బు ఇంత మందిని దూరం చేస్తుందా అని అప్పట్లో శర్వానంద్ బాగా బాధపడ్డాడట.
అలా ఆయన బాధల్లో ఉన్న సమయంలో ‘రన్ రాజా రన్’ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. శర్వానంద్ కెరీర్ లో ఇదే మొట్టమొదటి కమర్షియల్ హిట్ అనొచ్చు. అయితే అప్పుల కారణంగా శర్వానంద్ చాలా డల్ గా ఉండడంతో ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయాడట. యూవీ క్రియేషన్స్ సంస్థ సినిమా సూపర్ హిట్ అయ్యినందుకు ఒక సక్సెస్ పార్టీ ఇచ్చిందట. ఈ సక్సెస్ పార్టీ లో అందరూ ఒక వైపు ఎంజాయ్ చేస్తుంటే, శర్వానంద్ మాత్రం సైలెంట్ గా ఒక మూలన కూర్చొని ఉన్నాడట. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ కి సంబంధించినది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆరోజు ప్రభాస్(Rebel Star Prabhas) కూడా పార్టీ కి వచ్చాడట. శర్వానంద్ డల్ గా కూర్చోవడం చూసి, జరిగిందేదో జరిగింది, వదిలేయ్, హిట్ వచ్చిందిగా చివరికి, ఇక నుండి నీ సరికొత్త జీవితం మొదలు, మంచి టాలెంట్ ఉన్నోడివి బాధపడకు అని శర్వానంద్ ని దగ్గరకు తీసుకొని చాలా ధైర్యం చెప్పాడట. ఇదంతా ఒక ఇంటర్వ్యూ లో శర్వానంద్ చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు.
Also Read : ప్రభాస్ కంటే చిన్నదే అయినప్పటికి తనకి తల్లి గా నటించిన స్టార్ హీరోయిన్…