Spirit: స్పిరిట్ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్న ప్రభాస్… క్యారెక్టర్లు ఏంటంటే..?

ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా మరొక సమాచారం అయితే అందుతుంది. అయితే ఒక ప్రభాస్ పోలీస్ గా నటిస్తే ఇంకో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియడం లేదు కానీ ఇద్దరు ప్రభాస్ లు అయితే కనిపించబోతున్నట్టు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 14, 2024 11:07 am

Prabhas Spirit

Follow us on

Spirit: ప్రభాస్ రీసెంట్ గా సలార్ సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని కొత్తగా చూపించి తనదైన రీతిలో ఒక అదిరిపోయే హిట్ అయితే ఇచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో భారీ లెవెల్ లోకి ఎలివేషన్స్ ఇచ్చాడు. అందువల్లే ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులందరికీ సినిమా విపరీతంగా నచ్చింది దాంతో అభిమానులు పూర్తి సంతృప్తిని చెందారు. ఇక అదే విధంగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమా కూడా అభిమానులకి మంచి బూస్టప్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా మరొక సమాచారం అయితే అందుతుంది. అయితే ఒక ప్రభాస్ పోలీస్ గా నటిస్తే ఇంకో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియడం లేదు కానీ ఇద్దరు ప్రభాస్ లు అయితే కనిపించబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక స్క్రీన్ మీద ఒక ప్రభాస్ ని చూస్తేనే మన ఆడియన్స్ తట్టుకోలేరు అలాంటిది ఇద్దరు ప్రభాస్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఇక రచ్చ రచ్చే అంటూ ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇంకో ప్రభాస్ క్యారెక్టర్ అనేది సస్పెన్స్ గా పెట్టి దాన్ని సినిమా ఇంటర్వెల్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకోసమే ఆ క్యారెక్టర్ ని ఇప్పుడప్పుడే రివిల్ చేసే విధంగా కనిపించడం లేదు. సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ క్యారెక్టర్ ని రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా సమ్మర్ నుంచి షూటింగ్ కి వెళ్ళిబోతుంది. కాబట్టి ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక దానికి సంబంధించి మెకోవర్ పనుల్లో ప్రభాస్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ సలార్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే స్పిరిట్ తో సందీప్ ప్రభాస్ ని ఎంత కొత్తగా చూపిస్తాడు అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది…