Trivikram And Allu Arjun
Trivikram And Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుకున్న హీరో అల్లు అర్జున్…ఈయన పుష్ప సినిమా పోషించిన పుష్ప రాజ్ పాత్ర లో కనబరిచిన నటనకి గాను నేషనల్ అవార్డ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి హీరో ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరొకసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి చూస్తున్నాడు.
ఇలాంటి క్రమంలోనే ఈయన పుష్ప 2 సినిమా తర్వాత తనకు వరుసగా మూడు సక్సెస్ లను ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ప్లాప్ అవ్వడం తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్నాడు.
ఇలాంటి క్రమంలో ఒక ప్లాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో సినిమా చేస్తే తన మార్కెట్ ఎంతవరకు బాగుంటుంది అనే విషయం మీద కూడా తను దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన సన్నిహితులు చెబుతున్న మాటలను బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచనలో అల్లు అర్జున్ లేనట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాని కొద్ది రోజులు హోల్డ్ లో పెడదామని అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కనక హోల్డ్ లో పడినట్లయితే త్రివిక్రమ్ కెరీర్ చాలా వరకు డేంజర్ లో పడినట్టే…
ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ వాళ్ళ వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్లీ తనకి కొత్తగా డేట్స్ ఇచ్చే హీరో ఎవరు లేరు అందువల్ల త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పడకుండా తెరకెక్కించే విధంగా త్రివిక్రమ్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అలా వైకుంఠపురంలో సినిమాతో తనకు ఒక నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఎంత మేరకు ముందుకు వస్తాడు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది…