Prabhas Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. అసలు సినిమాకి బడ్జెట్ పెరిగితే.. దర్శక నిర్మాతలు వెంటనే రెండు పార్ట్స్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ రెండు భాగాల ట్రెండ్ బాహుబలితో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సర్వసాధారణం అయిపోయింది. ఒక సినిమాకు రెండు భాగాలు అంటే.. రెండు సినిమాలకు వచ్చే అంత డబ్బు వచ్చినట్టే.

నిజానికి బాహుబలి రెండు భాగాలుగా రావడం వల్లే, వందల కోట్లు లాభాలను గడించింది. ఇక కేజీఎఫ్ తొలి భాగం సూపర్ హిట్ అయి కోట్లు కుమ్మరించింది. రానున్న చాప్టర్ 2 పూర్తిగా లాభమే. అందుకే బన్నీ ఎక్కువ ఆలోచించకుండా పుష్షను పార్ట్ 1, పార్ట్ 2గా మార్చేసి.. బడ్జెట్ పై నిర్మాతలకు భరోసా ఇచ్చాడు. ఇప్పుడు సలార్‌దీ అదే పరిస్థితి.
Also Read: పాన్ ఇండియా స్టార్ అయ్యాకే, పొలిటీషియన్ అవుతాడట.
తాజాగా ప్రభాస్ ఇచ్చిన ప్రెస్ మీట్ లో ‘సలార్ రెండు భాగాలుగా వస్తుందా’ అని ఓ విలేఖరి అడగగా.. ‘దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారు’ అంటూ ప్రభాస్ ఇన్ డైరెక్ట్ గా యస్ అని చెప్పాడు. మరి సలార్ రెండు భాగాలుగా వస్తే.. నిర్మాతలకు లాభాల పంట పండినట్టే. పైగా ప్రభాస్ హీరో, బాహుబలి హీరో అంటూ నేషనల్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

అన్నిటికి మించి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు కేజీఎఫ్ లానే .. సలార్ ని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. మొత్తానికి సలార్ రెండు సార్లు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా బిజినెస్ పరంగా కూడా భారీ లాభాలను ఆర్జించడంలో ప్రశాంత్ నీల్, రాజమౌళి లాగే బాగా ఆరితేరిపోయిన. కాకపోతే సలార్ ప్రారంభించే ముందు స్క్రిప్ట్ ను ఒక పార్ట్ కి అనుకునే రాసుకున్నారు. మరి మధ్యలో స్క్రిప్ట్ మారిస్తే.. అసలుకే మోసం వస్తోందేమో చూడాలి.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !
[…] Also Read: Prabhas Salaar Movie: ‘సలార్’ గురించి అదిరిపోయే సీ… […]
[…] […]