Russia Launching Ayya T1 Mobile: ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత పెద్ద ఎత్తున ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇక సైబర్ దాడికి గురి అవుతోంది. అమెరికా, యూరప్ దేశాలు రష్యాను టెక్నాలజీతో చావుదెబ్బ తీస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా సూపర్ ప్లాన్ రెడీ చేసింది. ప్రపంచదేశాలు విధించే ఆంక్షలు, వాటి ఫలితంగా ఎదురవుతున్న టెక్నాలజీ సమస్యల పరిష్కారం కోసం రష్యా సొంత టెక్నాలజీవైపు అడుగులు వేస్తోంది.

ఉక్రెయిన్ పై యుద్ధంతో ఐటీ, టెక్నాలజీ సేవలను అమెరికా , యూరప్ దేశాలు నిలిపివేసినా కూడా రష్యా తగ్గేదేలే అన్నట్టుగా భయపడకుండా ముందుకెళుతోంది. తమపై ఆంక్షలు విధిస్తే యుద్ధానికి దిగినట్టేనని కూడా బెదిరిస్తోంది. ఈ క్రమంలోనే రష్యా ప్రీప్లాన్ ను రెడీ చేస్తోంది. అందులో భాగంగానే సొంత టెక్నాలజీ తయారు చేసింది.
ఉక్రెయిన్ పై యుద్ధంతో యాపిల్ సహా పలు టెక్నాలజీ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తమ ఉత్పత్తులను రష్యాకు పంపబోమని యాపిల్ సహా దాదాపుగా అన్ని కంపెనీలు ప్రకటించాయి. యాపిల్ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ను రష్యాకు నిలిపివేయడంతో ఆ దేశం ముందుగానే ప్లాన్ రెడీ చేసుకుంది.
Also Read: Prabhas Salaar Movie: ‘సలార్’ గురించి అదిరిపోయే సీక్రెట్ చెప్పిన ప్రభాస్
ఐఫోన్ కు ధీటుగా పనిచేసే స్వదేశీ మొబైల్ ను వినియోగించాలని రష్యా తమ దేశ పౌరులకు పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును ‘అయా టీ1’గా రష్యా ప్రకటించింది. ఈ ఫోన్ ఐఫోన్ కు ఏమాత్రం తీసిపోదట.. ‘అయాటీ1’ గా మొబైల్ ను రష్యా సంస్థ స్కేల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ కు అనుబంధంగా పనిచేస్తున్న స్మార్ట్ ఇకో సిస్టమ్ అభివృద్ధి చేసింది. 15 నుంచి 19వేల రూబుల్స్ విలువ చేసే ఈ ఫోన్ వినియోగదారులపై ఇతరులు నిఘా పెట్టలేరు. తమపై నిఘా పెట్టాలనుకునే వ్యక్తుల ఫోన్ల మైక్రోఫోన్, కెమెరాలను ‘అయా టీ1’ టర్న్ ఆఫ్ చేస్తుందట.. ఇందుకోసం ఈ ఫోన్ లో సరికొత్త హార్డ్ వేర్ బటన్ ఏర్పాటు చేశారట..
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ఫోన్ 4000 ఎంహెచ్ఏ బ్యాటరీ, 64 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 6.5 అంగులాల డిస్ ప్లే, మీడియా టెక్ హీలియో పీ70 ప్రాసెసర్ తో అందిస్తున్నారు. దీనికి రెండు కెమెరాలు అమర్చారు. 12 ఎంపీ, 5 ఎంపీ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన ఆధునిక కెమెరాలు పెట్టారు. మొత్తంగా హ్యాక్ కానీ రీతిలో సరికొత్త ఫోన్ ను రష్యా ఆవిష్కరిస్తూ దిగ్గజ సంస్థలకు షాక్ ఇస్తోంది.
Also Read: Russia Ukraine War: రష్యాపై కార్పొరేట్ యుద్ధం.. 50 దేశాలతో పుతిన్ కటీఫ్
[…] Russia Ukraine war 2022: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం మొత్తం ప్రతిఫలం అనుభవిస్తోంది. ఫలితంగా యుద్ధం ప్రభావంతో అన్ని దేశాల్లో ధరలు పెరగనున్నాయి. దీంతో పేద దేశాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని రష్యా చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. అయినా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్ని దేశాలు చెప్పినా పుతిన్ పెడచెవిన పెడుతున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధానికే కాలు దువ్వుతోంది. […]