Top Remuneration Heroines In Tollywood: సాధారణంగా మన తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్‌లకు రెమ్యునరేషన్ తక్కువగా ఉంటుంది. అందులోనూ హీరోయిన్‌లకు పోటీ కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే చేతిలో ఉన్న అవకాశాలు జారిపోతాయన్న భయం కూడా హీరోయిన్‌లలో ఉంటుంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం మాములు విషయం కాదని అందరూ భావిస్తుంటారు.

అయితే టాలీవుడ్‌లోనూ కొందరు హీరోయిన్‌లు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌లు అందుకుంటున్నారు. అలా సుమారు అరడజను మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా సమంత, నయనతార, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, రష్మిక, తమన్నా, కియారా అద్వానీ ఉంటారు. సమంత ప్రస్తుతం రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. యశోద సినిమాకు ఆమె ఈ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అటు నయనతార ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. రెమ్యునరేషన్ కారణంగానే ఆమె చిన్న సినిమాలకు సైన్ చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్న అనుష్క శెట్టి కూడా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అటు హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకుంటోంది. ఆమె ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గించుకున్న కాజల్ అగర్వాల్ కూడా బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. చిరంజీవి ఆచార్య సినిమా కోసం కాజల్ రూ.2కోట్లకు పైగానే పారితోషికం తీసుకుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. యువ హీరోల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక ఒక్కో సినిమాకు రూ.2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే ఒక్కో సినిమాకు రూ.75 లక్షలు తీసుకుంటోంది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా కియారా అద్వానీ రామ్‌చరణ్ సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది.