Salaar: ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన ప్రభాస్, సలార్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. సలార్ మూవీలో ప్రభాస్ ఊచకోత, యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. అభిమానులు ఆశించిన విధంగా ప్రభాస్ ని చూపించడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యారు. ఇక క్లైమాక్స్ లో ఎండింగ్ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు.
Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…
సలార్ పార్ట్ 2 పై ఆసక్తి పెంచే విధంగా ఉంటుంది. పార్ట్ 1 లో ప్రాణ స్నేహితులు గా ఉన్న దేవా, వరద రాజమన్నార్ బద్ధశత్రువులుగా కనిపించనున్నారు. ఇందులో మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది.
కాగా సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. 2024 జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ కి మించిన రెస్పాన్స్ ఓటిటీలో సలార్ కి దక్కడం కొసమెరుపు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ కొల్లగొట్టింది. దేశంలోనే బెస్ట్ మూవీ గా నిలిచింది. రిలీజ్ అయిన కొన్ని వారాల పాటు సలార్ మూవీ టాప్ లో ట్రెండ్ అయ్యింది. కాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే సలార్ 20 మిలియన్ల వ్యూస్ సాధించిన మూవీ గా నిలిచింది.
తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ సినిమాగా సలార్ రికార్డులకు ఎక్కింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం సలార్ మూవీ 21 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. తర్వాత ఆర్ ఆర్ ఆర్ 16. 2 మిలియన్లు, ఫైటర్ 14 మిలియన్లు, యానిమల్ 13. 6 మిలియన్లు, గంగూభాయ్ 13. 4 మిలియన్లు, సైతాన్ 13 మిలియన్లు, లాపతా లేడీస్ 11. 2 మిలియన్లు, జవాన్ 10. 9 మిలియన్లు, డంకీ 10. 8 మిలియన్ల వ్యూస్ తో సలార్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిక్స్డ్ టాక్ తో సలార్ ఓటీటీలో ఈ స్థాయి ఆదరణ పొందడం అనూహ్య పరిణామం.
మరోవైపు ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ ప్రభంజనం సృష్టిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి చేర్చింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు. కాగా కల్కి 2898 ఏడీ ఓటిటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…