Car Care Tips: కార్లు ఉన్నవారు వర్షా కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయకుండా ఉండాలి?

వర్షాకాలంలో కారు తడవడాన్ని కొందరు లైట్ గా తీసుకుంటారు. కానీ కొన్ని గంటల పాటు కారు వర్షంలో ఉంటే నష్టమే. అలాగే ఒక్కోసారి భారీ వర్షం వస్తుంది. ఈ క్రమంలో వరదలు సైతం ఒక్కసారిగా రావడంతో వాహనాలు బయట ఉంచడం వల్ల అవి కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల రెయిన్ సీజన్ ప్రారంభమైందంటే కారు విషయంలో కేర్ ఉండాలి.

Written By: Chai Muchhata, Updated On : July 30, 2024 11:38 am

Car Care Tips

Follow us on

Car Care Tips: ప్రస్తుతం దేశంలో వర్షాలు విజృంభిస్తున్నాయి. తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో మినహా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. ప్రాజెక్టులు సైతం నిండడంతో కొన్నంటి గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. తాజాగా శ్రీశైలం 3 గేట్లు తెరిచారు. మారుమూల ప్రాంతాల్లో వరద వస్తే సమీపంలోని చెరువు లేదా నదుల్లోకి నీరు వెళ్తుంది. కానీ పట్టణాలు, నగరాల్లో వరదలు విజృంభిస్తే ఇళ్లలోకి నీరు వస్తుంది. దీంతో ఇంట్లో వస్తువులతో పాటు వాహనాలు నీటిలో మునుగుతాయి. వర్షాకాలంలో పట్టణాల్లో వరదలు సంభవించినప్పుడు కొన్ని వాహనాలు వరదలో కొట్టుకుపోవడాన్ని గమనిస్తూ ఉంటాం. ఈ వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు. కానీ లేకపోతే మాత్రం చాలా వరకు నష్టాన్ని ఎదుర్కొన్నట్లే. మరికొన్ని వాహనాలు ఇలా వరదలో కొట్టుకుపోకపోయినా వర్షంలో ఉండడం వల్ల దెబ్బతింటాయి. దీంతో కొన్నిపార్ట్స్ డ్యామెజ్ అయి వాహనం నడకుండా మారుతంది. ఫలితంగా ఆ వాహన దారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అయితే చాలా మంది వాహనాల విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టపోతుంటారు. ముందే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటే నష్ట నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా 4 వీలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టం చేకూరనుంది. వర్సాకాలంలో ఫోర్ వీలర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ముందే పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆసలు కారుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి? అనే వివరాల్లోకి వెళితే..

వర్షాకాలంలో కారు తడవడాన్ని కొందరు లైట్ గా తీసుకుంటారు. కానీ కొన్ని గంటల పాటు కారు వర్షంలో ఉంటే నష్టమే. అలాగే ఒక్కోసారి భారీ వర్షం వస్తుంది. ఈ క్రమంలో వరదలు సైతం ఒక్కసారిగా రావడంతో వాహనాలు బయట ఉంచడం వల్ల అవి కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల రెయిన్ సీజన్ ప్రారంభమైందంటే కారు విషయంలో కేర్ ఉండాలి.

వర్సాకాలం ప్రారంభం అవుతుందన్న తరుణంలో కారుకు సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కారు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడ ఫ్లూడ్ ను చేర్చరు. దీని కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వరదలు ఎక్కువగా సంబవించే ప్రాంతాలైతే అందుకు తగిన విధంగా ఇన్సూరెన్స్ ఉండాలి. నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవి వర్తించే అవకాశం ఉండదు. అందువల్ల ఇన్సూరెన్స్ తీసుకునే టప్పుడు ఈ విషయాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి.

కారు ఉన్న వారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారైతే రెయిన్ సీజన్ తగ్గే వరకు వెహికల్ ను వేరే ప్రాంతాల్లో పార్క్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోండి. బంధువులు లేదా కార్యాలయాల్లో.. అవి కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాయని తెలిస్తే కారును కొన్నాళ్ల పాటు అక్కడే ఉండే విధగా ఏర్పాటు చేసుకోండి. దీంతో కొంత మేర నష్ట నివారణ ఉంటుంది.

వర్షంలో కారు తడవకుండా ప్రత్యేక కవర్ ను ఏర్పాటు చేసుకోండి. లేదా ఇంట్లోనే కారు కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం మంచిది. వ్యక్తుల దగ్గర ఉన్న విలువైన వస్తువుల్లో కారు ఒకటి దీనిని రక్షించడం వల్ల భారీ నష్టం నుంచి తప్పించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వర్షంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. కొన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉంటే ఆ నీరు కారు ఇంజిన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది.

వరదలు ఉన్నాయని సమాచారం తెలిసిన తరువాత అటువైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. లేకుంటే కారు నీటిలో మునగడం వల్ల ఇన్నర్ లోకి నీరు వస్తుంది. దీంతో కొన్నాళ్ల పాటు అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వస్తువులు నీటిలో మునగడం వల్ల పాడైపోతాయి.