https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ సీక్రెట్ పిక్ లీక్.. షాక్ లో టీమ్

Prabhas: హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా “సలార్”. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ నుంచి ఓ పిక్ లీక్‌ అయి వైరల్‌‌ గా మారింది. షూటింగ్ స్పాట్‌ లో ప్రభాస్ మాస్ లుక్‌ లో ఉండగా ఎవరో ఫోటో తీసి లీక్ చేశారు. రఫ్ లుక్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 01:59 PM IST
    Follow us on

    Prabhas: హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా “సలార్”. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ నుంచి ఓ పిక్ లీక్‌ అయి వైరల్‌‌ గా మారింది.

    Prabhas

    షూటింగ్ స్పాట్‌ లో ప్రభాస్ మాస్ లుక్‌ లో ఉండగా ఎవరో ఫోటో తీసి లీక్ చేశారు. రఫ్ లుక్ లో ప్రభాస్ చాలా వైల్డ్ గా ఉన్నాడు. ఈ పిక్ ను బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కూడా ‘సలార్’ గురించి మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్’ సిరీస్ కి మించిన ఫుల్ యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చాడు.

    Also Read: Natural Star Nani: స్టార్ డైరెక్టర్ కి హీరో నానీ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో

    ఈ పిక్ లో ప్రభాస్ లుక్ చూస్తుంటే… ప్రశాంత్ నీల్ మాటల్లో మ్యాటర్ ఉందని అర్ధం అవుతుంది. ఇక ఇన్నాళ్లు ఆదిపురుష్ సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా గడిపిన ప్రభాస్, ఆ సినిమాను పూర్తి చేశాడు. అందుకే, సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశాడు. రెండు వారాల పాటు ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది.

    ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకే పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పిక్ లీక్ అవ్వకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోలేక పోయారు. ఏది ఏమైనా ఈ పిక్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.

    Prabhas:

    ఎలాగూ ‘సలార్’ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టు భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు.

    Also Read: Shocking News Anakapalle: స‌ర్ ప్రైజ్ అని చెప్పి కాబోయే భ‌ర్త గొంతు కోసిన యువ‌తి.. ఇదేం పిచ్చి తల్లి నీకు..

    Recommended Videos:

    Tags