Tik Tok Durga Rao Income: దుర్గారావు.. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఇతడు సినిమా పాటలకు వేసిన స్టెప్పులు కామెడీతో అలరిస్తూ అందరికీ చేరువ అయ్యాయి. ఈ క్రమంలోనే ‘నాది నక్కిలిసు గొలుసు’ అనే దుర్గారావు దంపతులు చేసిన పాట వైరల్ అయ్యింది. ఆ తర్వాత జబర్ధస్త్ సహా పలు స్టేజీలపై వీరు చేసిన డ్యాన్స్ తో అందరికీ దుర్గారావు చేరువ అయ్యాడు.

తన వెరైటీ డ్యాన్స్ స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులకు దుర్గరావు చిరపరిచితుడయ్యాడు. అతడి డ్యాన్స్ వీడియోలు నవ్వించడమే కాదు.. ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు దుర్గారావు ఒక సెలబ్రెటీ. అతడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !
జబర్ధస్త్ సహా జీతెలుగు, స్టార్ మా చానెల్ ప్రోగ్రాంలకు దుర్గారావు రావడంతో ఇక దశ తిరిగిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరినీ భారీ ఈవెంట్స్ కు డబ్బులిచ్చి మరీ పిలుస్తున్నారు. ఈ దెబ్బతో ఒకప్పుడు బట్టలు కుడుతూ డ్యాన్స్ చేసిన దుర్గారావు సంపాదన వేల నుంచి ఇప్పుడు నెలకు లక్షలకు చేరిందని సమాచారం.

Also Read: తినడానికి తిండి లేక ఈ యాక్టర్ ఏం చేశాడంటే?
కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ కు కూడా దుర్గారావుతో చేయిస్తున్నారని.. ఆ ఆదాయంతోపాటు యూట్యూబ్ చానెల్ నుంచి అతడికి ప్రతినెల డ్యాన్సింగ్ వీడియోలతో 50వేల వరకూ ఆదాయం వస్తోందట.. ఇలా తన విలక్షణ డ్యాన్స్ వ్యాపకమే ఇప్పుడతడిని లక్షాధికారిని చేసింది. ఎందులో అయినా తమ అభిరుచి చూపిస్తే సక్సెస్ అవుతారనడానికి ‘దుర్గారావు’ ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు.



[…] Star Hero sons: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లు కొనసాగుతున్నారు. వారు నట వారసత్వం నుంచే వచ్చారు. కృష్ణ నుంచి మహేష్, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్.. చిరంజీవి అల్లుడిగా బన్నీ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. తమదైన ప్రతిభతో ఇండస్ట్రీలో టాప్ హీరోల స్థాయికి ఎదిగారు. అలా ఎదగడంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు. […]
[…] Beast Movie Collections: టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. మరి, రాజు గారికి ఎంత లాభం ? ఎంత నష్టం ? లెక్కల వైజ్ గా చూద్దాం. […]