Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ వేదికగా ఈ ఆదివారంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రముఖ కమెడియన్ మహేష్ విట్టా ఎలిమినేషన్ తోపాటు మరో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కామెడీ పంచగల బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అదిరిపోయింది. దీంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఈ వారం నామినేషన్స్ లో అజయ్, హమీదా, అషురెడ్డి, అఖిల్, అనీల్, బిందుమాధవి ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన బాబా భాస్కర్ కు బిగ్ బాస్ సంచలన పవర్ ఇచ్చాడు. దీంతో దాన్ని ఉపయోగించుకొని బిగ్ బాస్ గేమ్ నే మార్చేశాడు బాబా భాస్కర్..
Also Read: Natural Star Nani: స్టార్ డైరెక్టర్ కి హీరో నానీ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో
బిగ్ బాస్ ఓటీటీ షోను శీఘ్రంగా ఫాలో అవుతున్న బాబా భాస్కర్ కు బయట ప్రేక్షకుల మద్దతు ఎవరికి ఎక్కువుందన్న విషయం బాగా తెలుసు. హౌస్ లోనే అందరికంటే ఎక్కువగా బిందుమాధవిని ప్రజలు అభిమానించి ఆమెకే ఓట్ల వర్షం కురిపిస్తున్నారని తెలుసు. అందుకే ఈ వారం నామినేషన్స్ లోంచి ఒకరిని కాపాడే పవర్ బిగ్ బాస్ తాజాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ కు ఇచ్చారు. ఈ క్రమంలోనే బాబా తెలివిగా ప్రేక్షకాదరణ అధికంగా ఉన్న బిందుమాధవిని ఈ నామినేషన్స్ నుంచి తప్పించాడు. ఆటను మలుపుతిప్పాడు. ఇక తన ఆటను కూడా మొదలుపెట్టాడు బాబా..

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో రెండు గ్రూపుల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. ఒకటి బిందుమాధవి గ్రూప్ కాగా.. రెండోది అఖిల్ గ్రూప్. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ అఖిల్ బ్యాచ్ వర్సెస్ బిందుమాధవి అన్నట్టుగా ఆట టఫ్ ఫైట్ సాగుతోంది. ఇటీవలే బిందుమాధవి బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ శివ కూడా ప్లేటు ఫిరాయించి అఖిల్ కు మద్దతుగా మాట్లాడడంతో బిందు ఒంటరి అయ్యింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీం బాబా భాస్కర్ ను దించి బిందుకు ఆదిలోనే సపోర్ట్ చేయించారని తెలుస్తోంది. లేక ఫుల్ ఫాలోయింగ్ ఉన్న బిందుకు బాబానే సపోర్ట్ చేశాడని పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.

బాబా భాస్కర్ ఎంట్రీతో మరో డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల్ బ్యాచ్ లో ఉండి నటరాజ్ చేస్తున్న హంగామా, బూతులు, ఇష్టానుసార ప్రవర్తనతో అతడిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఎలిమినేట్ కావాల్సి ఉన్నా హౌస్ లో కంటెంట్ కోసం ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో డ్యాన్స్ మాస్టర్ కం ఎంటర్ టైనర్ బాబా భాస్కర్ ఎంట్రీతో నటరాజ్ మాస్టర్ కు మూడినట్టేనని తెలుస్తోంది. వచ్చే వారం నటరాజ్ ను బయటకు పంపుతారని ప్రచారం సాగుతోంది. ప్రేక్షకుల ఓటింగ్ లో కూడా నటరాజ్ చివరనే ఉంటున్నాడు. సో వచ్చే వారం ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
Also Read:Shocking News Anakapalle: సర్ ప్రైజ్ అని చెప్పి కాబోయే భర్త గొంతు కోసిన యువతి.. ఇదేం పిచ్చి తల్లి నీకు..
Recommended Videos


