Salaar: సలార్ మూవీ మరో రెండు వారాల్లో విడుదల కానుంది. ఇండియా వైడ్ యాక్షన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మిశ్రమ స్పందన దక్కింది. అయితే వ్యూస్ విషయంలో రికార్డు బద్దలు కొట్టింది. కెజిఎఫ్ ట్రైలర్ రికార్డు ని సలార్ ట్రైలర్ అధిగమించింది. ట్రైలర్ లో చిత్ర కథపై హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇది ఇద్దరు మిత్రుల కథ. ప్రభాస్-పృథ్విరాజ్ ఆ మిత్రులుగా కనిపిస్తున్నారు.
ఓ కారణంగా మిత్రుడిని వదిలి వెళ్లిపోతాడు హీరో. అయితే మిత్రుడి కోసం మరలా తిరిగి వస్తాడు. మిత్రుడు కోరుకున్న రాజ్యం తనకు అప్పగించేందుకు సైనికుడిగా మారతాడు. శత్రువులతో యుద్ధం చేస్తాడు. సలార్ రెండో భాగం కూడా ఉందని ట్రైలర్ ద్వారా చెప్పారు. కాబట్టి సలార్ సైతం రెండు భాగాలుగా విడుదల కానుంది. జగపతిబాబు, బాబీ సింహ కీలక రోల్స్ చేస్తున్నారు.
కాగా సలార్ సెన్సార్ జరుపుకుంది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సలార్ మూవీకి ఓన్లీ ఫర్ అడల్ట్ ‘A ‘ సర్టిఫికెట్ దక్కింది. ఈ మూవీలో హింస, వైలెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని సెన్సార్ ద్వారా తెలుస్తుంది. రక్తపాతంతో కూడిన యాక్షన్ సన్నివేశాలు ఉన్న కారణంగానే A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక సలార్ రన్ టైం 2 గంటల 55 నిముషాలు. దాదాపు మూడు గంటలు సుదీర్ఘంగా ఉండనుంది.
సలార్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. సలార్ తో ప్రభాస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరొక యాక్షన్ పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక చూడాలి సలార్ ఏ స్థాయి విజయం సాధించనుందో…