Salaar Collections: బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ లేదు. ఆయన హ్యాట్రిక్ ప్లాప్స్ ఇచ్చారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా… జనాల్లో ప్రభాస్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాడు. ఆయన ప్లాప్ సినిమాల పేరిట కూడా రికార్డ్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ పేరిట ఓ అరుదైన రికార్డు నమోదు అయ్యింది. అది ఎవరూ టచ్ చేయలేనిది.
ప్రభాస్ నటించిన నాలుగు చిత్రాలు ఓపెనింగ్ డే వంద కోట్ల వసూళ్లు అందుకున్నాయి. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ మొదటి రోజే వంద కోట్ల వసూళ్ల మార్క్ దాటాయి. సలార్ ఫస్ట్ డే రూ. 178.7 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. 2023కి గాను మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇక మొదటి రోజు వంద కోట్లు వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. పఠాన్, జవాన్ చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ రెండు చిత్రాలు ఫస్ట్ డే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్… ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఫస్ట్ డే వంద కోట్లు రాబట్టారు. యష్ నటించిన కెజిఎఫ్ 2, రన్బీర్ కపూర్ యానిమల్ ఫస్ట్ డే వంద కోట్లు సాధించిన చిత్రాల లిస్ట్ లో ఉన్నాయి.
ఎన్టీఆర్-రామ్ చరణ్, యష్, రన్బీర్ కపూర్ మూడో స్థానంలో ఉన్నారు. కాగా సలార్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది. ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ కట్ అవుట్ కి సెట్ అయ్యే సినిమా పడింది అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీలో పృథ్విరాజ్ సుకుమార్ మరో కీలక రోల్ చేశారు.వరల్డ్ వైడ్ డిసెంబర్ 22న విడుదల చేశారు.