ప్రభాసా మజాకా.. జపాన్‌లో ‘సాహో’ రికార్డు

ఏ ముహూర్తాన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘బాహుబలి’ మొదలు పెట్టాడో.. అప్పటి నుంచి యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగిపోతూ వస్తోంది. బాహుబలి రెండు పార్టులు రిలీజై సూపర్ హిట్స్‌ కావడంతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్ అయిపోయాడు. వరల్డ్‌ వైడ్‌ అతని పేరు మార్మోగింది. బాహుబలి తర్వాత అతను యాక్షన్‌ డ్రామా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుజీత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ తెలుగులో అంతగా ఆడకపోయినా హిందీ వెర్షన్‌ మాత్రం బాలీవుడ్‌లో […]

Written By: Neelambaram, Updated On : July 22, 2020 4:16 pm
Follow us on


ఏ ముహూర్తాన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘బాహుబలి’ మొదలు పెట్టాడో.. అప్పటి నుంచి యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగిపోతూ వస్తోంది. బాహుబలి రెండు పార్టులు రిలీజై సూపర్ హిట్స్‌ కావడంతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్ అయిపోయాడు. వరల్డ్‌ వైడ్‌ అతని పేరు మార్మోగింది. బాహుబలి తర్వాత అతను యాక్షన్‌ డ్రామా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుజీత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ తెలుగులో అంతగా ఆడకపోయినా హిందీ వెర్షన్‌ మాత్రం బాలీవుడ్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ రిలీజై దాదాపు ఏడాదైంది. టీవీలో కూడా వచ్చి టీఆర్పీస్‌లో దుమ్ముదులిపింది. ఈ మూవీ ఇప్పుడు జపాన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

Also Read: ప్రభాస్‌ మూవీ కోసం దీపిక అంత తీసుకుందా!

కరోనా తర్వాత జపాన్‌లో ఈ మధ్యే థియేటర్లు రీఓపెన్‌ అయ్యాయి. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సాహో ఇప్పుడు జపానీస్‌ భాషలో అక్కడ మరోసారి ప్రదర్శితమవుతోంది. విషయం అక్కడితోనే అయిపోలేదు. జపాన్‌లో రిలీజైన్‌ భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది సాహో. 1.10 వేల యూస్‌ డాలర్లు వసూల్‌ చేసి… అమీర్ ఖాన్ ‘దంగల్‌’ రికార్డును బ్రేక్‌ చేసింది. అలాగే, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టి ఐదు ఇండియన్‌ ఫిల్మ్స్‌లో చోటు దక్కించుకుంది. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘3 ఇడియట్స్‌’, ‘ముత్తు’, ‘బాహుబలి 2’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తానికి రీరిలీజైన సినిమానే ఇలా రికార్డు కొడితే.. ప్రభాస్‌ ఫ్యూచర్లో వచ్చే మూవీస్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతాయో చూడాలి.