https://oktelugu.com/

మహిళా టెర్రరిస్ట్‌గా సమంత!

అందం, అభినయంతో తెలుగులోనే కాకుండా సౌత్‌ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది సమంత అక్కినేని. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. వరుస హిట్లతో దూసుకెళ్లోంది. పెళ్లయ్యాక కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోందామె. ఈ క్రమంలో రీసెంట్‌గా ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి హిట్‌ సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఓ హిందీ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెజాన్‌లో సూపర్ హిట్‌ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ సెకండ్‌ పార్ట్‌లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 04:00 PM IST
    Follow us on


    అందం, అభినయంతో తెలుగులోనే కాకుండా సౌత్‌ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది సమంత అక్కినేని. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. వరుస హిట్లతో దూసుకెళ్లోంది. పెళ్లయ్యాక కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోందామె. ఈ క్రమంలో రీసెంట్‌గా ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి హిట్‌ సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఓ హిందీ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెజాన్‌లో సూపర్ హిట్‌ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ సెకండ్‌ పార్ట్‌లో సమంత కీలక పాత్ర పోషించింది. క్రైమ్‌ థ్రిల్లర్గా వచ్చిన ఫస్ట్‌ సీజన్‌ వరల్డ్‌ వైడ్‌ ఎంతో సక్సెస్‌ సాధించింది. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమ్‌ అవడంతో అందరికీ చేరువైంది. ఇండియాకు ముప్పు తలపెట్టే టెర్రరిస్టులను పట్టుకునే ప్రధాన పాత్రలో మనోజ్‌ బాజ్‌పేయ్‌ పోలీసు అధికారిగా, ఓ కుటుంబ పెద్దగా అద్భుత నటన కనబరిచాడు.

    Also Read: సూసైడ్‌ ఆర్‌ మర్డర్… సుశాంత్‌పై బయోపిక్‌

    సెకండ్‌ సీజన్‌లో అత్యంత కీలకమైన పాత్ర కోసం సమంతను తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇది ఓ మహిళా టెర్రరిస్ట్‌ పాత్రను సమంత పోషిస్తోంది. పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థ కోసం ఇండియాలో ఓ స్లీపర్ సెల్‌గా ఆమె పని చేస్తుందట. ఇది నెగెటివ్‌ రోల్‌ అయినప్పటికీ.. బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్‌ స్టోరీ ఉండే చాలెంజింగ్‌ పాత్ర కావడంతో సమంత దీనికి అంగీకరించిందని తెలుస్తోంది. ఈ పాత్రలో సమంత అద్భుతంగా నటించిందని మేకర్స్‌ చేబుతున్నారు. ఈ సిరీస్‌ రిలీజైన తర్వాత నార్త్‌లో కూడా సమంత పేరు మార్మోగుతుందని, బాలీవుడ్‌ దృష్టి ఆమెపై పడుతుందని అంటున్నారు.

    Also Read: ‘రాధేశ్యామ్‌’లో కీలక మార్పు!

    ఒకటి రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు నడుస్తున్నాయి. మనోజ్‌ ముంబైలో డబ్బింగ్‌ చెబుతుండగా.. సమంత కోసం హైదరాబాద్‌లోనే డబ్బింగ్‌ ఏర్పాట్లు చేశారు. వెబ్ సిరీస్‌ డైరెక్టర్లు రాజ్‌ నిడిమోరు, క్రిష్ణ డీకే .. జూమ్‌ కాల్స్‌ ద్వారా మనోజ్‌, సమంతతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఫస్ట్‌ పార్ట్‌లో నటించిన ప్రియమణి, సందీప్‌ కిషన్‌, నీరజ్‌ మాధవ్‌, షరీబ్‌ హంషి పాత్రలు సెకండ్ సిరీస్‌లోనూ కొనసాగుతాయి. ఈ సిరీస్‌ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు.