https://oktelugu.com/

ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ఫోకస్..

ఏపీలో కొత్త జిల్లాలకు జగన్ సర్కార్ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం నియోజకవర్గ ప్రతిపాదికను జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చూడుతోంది. ఏపీలోని 13జిల్లాలు 26జిల్లాలుగా మారనున్నాయి. అయితే ఈ సంఖ్య 30వరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రజలు, నేతల నుంచే వచ్చే విజ్ఞఫ్తుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ సర్కార్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 6:16 pm
    Follow us on


    ఏపీలో కొత్త జిల్లాలకు జగన్ సర్కార్ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం నియోజకవర్గ ప్రతిపాదికను జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చూడుతోంది. ఏపీలోని 13జిల్లాలు 26జిల్లాలుగా మారనున్నాయి. అయితే ఈ సంఖ్య 30వరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రజలు, నేతల నుంచే వచ్చే విజ్ఞఫ్తుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ప్రధాన ప్రతిపక్షం సైలెన్స్.. ఏపీలో ఇదే చర్చ..!

    జిల్లాల ఏర్పాటుతో వైసీపీ మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో సీఎం జగన్ జిల్లాల ఏర్పాటును ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూడురాజధానుల బిల్లు ఆమోదం పొందేక విశాఖ రాజధాని కావడం ఖాయమని తేలిపోయింది. అమరావతి నుంచి రాజధాని విశాఖకు మారుతుండటంతో ఈ ప్రాంతంలో వైసీపీ మరింత బలపడేందుకు అవకాశం దొరికింది. విశాఖ రాజధానితోపాటు ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడేలా జిల్లాల విభజనకు జగన్ శ్రీకారం చుట్టారనే వాదనలు విన్పిస్తున్నాయి.

    మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర ఇక ఐదు జిల్లాలుగా మారనుంది. అయితే అరకు భౌగళిక పరిస్థితులరీత్యా విశాఖతోపాటు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల వరకూ విస్తరించి ఉంది. అరకు నాలుగు జిల్లాలకు విస్తరించి అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది. దీంతో అరకుని రెండుగా చేయాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సీఎం జగన్ కు సూచించారు. దీంతో అరకును రెండుగా చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని అధికారులకు జగన్ ఆదేశించారు. దీంతో అరకు రెండుగా మారితే ఉత్తరాంధ్ర జిల్లాల సంఖ్య ఆరుకు పెరుగుతాయి. అయితే అరకుతోపాటు రాబోయే కొత్త జిల్లా ఏంటనే ఆసక్తి ఉత్తరాంధ్రలో నెలకొంది.

    Also Read: కన్నా భవితవ్యం తేలేది ఈవారమేనా?

    అరుకును రెండు విభజిస్తే వైసీపీకి మరింత పట్టు దక్కుతుందనే భావనతోనే డిప్యూటీ సీఎం శ్రీవాణి ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్వతీపురం జిల్లాగా చేయమని సంతకాల సేకరణ జరుగుతుండటంతో కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీవాణి ఈ ప్రతిపాదన జగన్ ముందుపెట్టినట్లు తెలుస్తోంది. పార్వతీపురం పక్కనే కురుపాం ఉంది. ప్రజల కోరిక మేరకు ఇక్కడ కొత్త గిరిజన జిల్లాను సాధిస్తే ఈ ప్రాంతంలో శ్రీవాణి హవా మరింత పెరగడంతో వైసీపీ మరింత బలపడనుంది.

    ఇక శ్రీకాకుళంలోని పాలకొండను కొత్త గిరిజన జిల్లాగా ప్రకటించాలని ఉద్యమాలు చేపడుతున్నారు. దీని వెనుక కూడా రాజకీయ పెద్దలు ఉన్నారనే చర్చ సాగుతోంది. దీంతో ఈ రెండింటిలో ఏది గిరిజన జిల్లాగా మారునుందనే చర్చ నడుస్తుంది. ఇందులో ఏ ఒక్కటి గిరిజన జిల్లాగా ప్రకటించకపోయినా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం కూడా అరకు పరిధిలోకే వస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలను కలుపుతూ అక్కడే కొత్త గిరిజన జిల్లా తెస్తే ఈ రెండు జిల్లాలు కూడా సైడ్ అయిపోతాయనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల సంఖ్యపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదిఏమైనా విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వైభవం దక్కించుకోవడం ఖాయంగా కన్పిస్తుంది.