https://oktelugu.com/

బుల్లితెర బాహుబలి ప్రభాస్

బాహుబలి చిత్రం తో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ కు హిందీ జనంలోనే అశేషమైన ఆదరణ దక్కింది. ఈ క్రేజ్ ప్రభాస్ నటించిన “సాహో” చిత్రం వసూళ్లతో మరింత ప్రూవ్ అయ్యింది సాహో చిత్రం తో ప్రభాస్ సినిమాలకు ఉత్తరాది న ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నిరూపితం అయ్యింది. కాగా హిందీలో కేవలం వెండితెర బాక్సాఫీస్ నే కాకుండా బుల్లితెరను కూడా రెబెల్ స్టార్ షేక్ చేసాడు. గత వారం పలు […]

Written By:
  • admin
  • , Updated On : May 11, 2020 / 10:22 AM IST
    Follow us on

    బాహుబలి చిత్రం తో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ కు హిందీ జనంలోనే అశేషమైన ఆదరణ దక్కింది. ఈ క్రేజ్ ప్రభాస్ నటించిన “సాహో” చిత్రం వసూళ్లతో మరింత ప్రూవ్ అయ్యింది

    సాహో చిత్రం తో ప్రభాస్ సినిమాలకు ఉత్తరాది న ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నిరూపితం అయ్యింది. కాగా హిందీలో కేవలం వెండితెర బాక్సాఫీస్ నే కాకుండా బుల్లితెరను కూడా రెబెల్ స్టార్ షేక్ చేసాడు. గత వారం పలు హిందీ సినిమాలతో పాటుగా ప్రభాస్ నటించిన ` బాహుబలి 2 ‘ మరియు `సాహో’ చిత్రాలను అక్కడ ఛానెల్స్ లో టెలికాస్ట్ చెయ్యడంజరిగింది. కాగా ఈ రెండు చిత్రాలకు మిగతా అన్ని చిత్రాలకు మించి భారీ స్థాయి టెలివిజన్ వ్యూయర్షిప్ దక్కింది.

    ఒక అంచనా ప్రకారం రాజమౌళి తెరకెక్కించిన హిస్టారికల్ ఎపిక్ వండర్’ బాహుబలి 2 ‘ చిత్రానికి గాను 73.89 లక్షల ఇంప్రెషన్స్ రాగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో కు 83.34 లక్షల ఇంప్రెషన్స్ వచ్చినట్టుగా ` బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా ‘ (BRAC ) వారు వెల్లడించారు.