https://oktelugu.com/

సీఎంలతో మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్!

లాక్ డౌన్ 3.0 ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి ఈరోజు అన్ని రాష్ట్రల సిఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించానున్నారు. లాక్ డౌన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నేడు సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈభేటి జరునుంది. కాగా లాక్‌ డౌన్ లో కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చి… గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల వారీగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 10:26 AM IST
    Follow us on

    లాక్ డౌన్ 3.0 ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి ఈరోజు అన్ని రాష్ట్రల సిఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించానున్నారు. లాక్ డౌన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నేడు సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈభేటి జరునుంది. కాగా లాక్‌ డౌన్ లో కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చి… గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల వారీగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అన్నది ప్రధాని రాష్ట్రాల సిఎంలు చెప్పిన దాన్ని బట్టీ… నెక్ట్స్ ఎలా ముందుకెళ్లాలో డిసైడ్ చేస్తారు. అయితే… చాలా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ పై అసంతృప్తితో ఉన్నాయి. కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ అమలుపరుస్తున్నప్పటికి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. అందువల్ల మీటింగ్‌ లో లాక్‌ డౌన్ అంతగా ఫలితం ఇవ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తారని తెలుస్తోంది.