Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) మనస్తత్వం గురించి తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు. కెరీర్ ప్రారంభం లో తనకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, సూపర్ హిట్ సినిమాలు ఇవేమి లేని రోజుల్లో ఎలా ఉండేవాడో, దేశం గర్వించ దగ్గ అతి పెద్ద సూపర్ స్టార్స్ లో ఒకరిగా మారినప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని పెద్దలు అనే మాటకు పర్యాయపదం లాంటి వాడు ప్రభాస్. ముఖ్యంగా మన దేశానికి ఏదైనా విపత్కర సందర్భాలు వచ్చినప్పుడు, తన వైపు నుండి సహాయ సహకారాలు అందించడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. అలాంటి ప్రభాస్ పెహల్గామ్(pahalgam) ఘటన గురించి కానీ, ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindoor) గురించి కానీ ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమైంది ప్రభాస్ కి, అసలు అతని వైపు నుండి సౌండ్ లేదంటూ అభిమానులు కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు.
Also Read : ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో…
ఇక ప్రభాస్ దురాభిమానులు అయితే ఈ అంశంపై ఎలాగో ట్రోల్ చేస్తారనుకోండి అది వేరే విషయం. అయితే ఎందుకు ప్రభాస్ ఇంత మౌనం గా ఉన్నాడు?, పెహల్గామ్ దాడి జరిగిన రోజు సైలెంట్ ఉన్నా ఎవ్వరూ అడిగేవారు కాదు కానీ, ఆ రోజున ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీ లో ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిజేశాడు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఆరోజు ఆయన సైలెంట్ గా ఉండుంటే, ప్రభాస్ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా ని ఉపయోగించడం లేదు, కాబట్టి ఆయన రెస్పాన్స్ ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు అని అంతా అనుకునేవారు. కానీ అవసరమైనప్పుడల్లా ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని ఉపయోగిస్తూనే ఉన్నాడు, అయినప్పటికీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలపై మౌనం ఎందుకు వహిస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
గత ఏడాది ప్రభాస్ రాజా సాబ్ మూవీ షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొనేవాడు. ఆ తర్వాత ఆయన యూరోప్ కి వెళ్లి అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకొని ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత హను రాఘవపూడి మూవీ ని మొదలు పెట్టాడు. నాన్ స్టాప్ గా ప్లాన్ చేసిన రెండు మూడు షెడ్యూల్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆయన యూరోప్ కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఎలాంటి షూటింగ్ లోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇకపోతే హను రాఘవపూడి తో చేస్తున్న ‘ఫౌజీ’ చిత్రం లో హీరోయిన్ గా పాకిస్థాన్ అమ్మాయి ఇమాన్వి నటిస్తుంది. పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత కూడా ఈమెని ఫౌజీ చిత్రం నుండి తప్పించకపోవడం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ విషయం ఇమాన్వి వరకు చేరడం తో ఆమె వెంటనే స్పందించి నేను ఇండో అమెరికన్ అమ్మాయిని అంటూ క్లారిటీ ఇచ్చింది.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?