Rohit : కానీ ఎందుకనో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ పెద్దలు తొందరపడినట్లు తెలుస్తోంది . ఎరుపు రంగు బంతి ఫార్మాట్లో రోహిత్ శర్మ విఫల ప్రదర్శనను సాకుగా చూపిస్తూ.. సెలక్షన్ కమిటీ అతడిని టెస్ట్ జట్టు కెప్టెన్ స్థానం నుంచి పక్కకు తప్పుకోవాలని సూచించింది. వాస్తవానికి గత కొంతకాలంగా సెలక్షన్ కమిటీ ఇదే విషయంపై రోహిత్ శర్మతో పలు సందర్భాల్లో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రోహిత్ ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టులు ఆడాలి. దానికి జట్టును సిద్ధం చేసే క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో సమావేశమైంది. కెప్టెన్సీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదేదో తన పీఠం కిందికి నీళ్లు తెచ్చే కార్యక్రమంలా ఉంది అని భావించిన రోహిత్ శర్మ ముందుగానే జాగ్రత్తపడ్డాడు. కెప్టెన్ గా పనిచేసిన జట్టులో.. సాధారణ ఆటగాడిగా ఉండడం సరికాదని భావించిన రోహిత్.. మరో మాటకు తావు లేకుండానే తన కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు
Also Read : కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మకు ఉద్వాసన.. కీలక నిర్ణయం తీసుకున్న టీమిండియా సారధి
గిచ్చి జోల పాడుతోంది
సాధారణంగా ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడు బీసీసీఐ పెద్దలు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. వారికి అపరిమితమైన అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. కానీ ఫామ్ కోల్పోతే మాత్రం పక్కన పెడతారు. లేదా పొమ్మన లేక పొగ పెడతారు. గతంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరిగింది. కాకపోతే అతడు కోపాన్ని వెంటనే వ్యక్తం చేసే ఆటగాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది.. కానీ రోహిత్ అలా కాదు.. అతడు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉండే రకం కాదు. అంటే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఆత్మాభిమానం లేని వాడని కాదు. కాకపోతే రోహిత్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే కెప్టెన్సీ నుంచి తప్పుకోమని బీసీసీి సెలక్షన్ కమిటీ సూచించిందో.. అప్పుడే రోహిత్ శర్మ అలర్ట్ అయిపోయాడు. మరో మాటకు తావు లేకుండా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇక టెస్ట్ క్రికెట్ కి శాశ్వత వీడ్కోలు పలికిన నేపథ్యంలో రోహిత్ శర్మకు బీసీసీఐ సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. రోహిత్ లేని ఇండియన్ టెస్ట్ క్రికెట్లో లోటు ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్యానించింది. రోహిత్ క్రికెట్ లెజెండ్ అని.. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్న ఆటగాడని.. అతడు యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొంది. ఇక రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లినట్టు గుర్తించింది. అంతేకాదు అనేక సందర్భాల్లో టీమిండియా టెస్ట్ జట్టుకు ప్రత్యర్థి జట్ల నుంచి విజయాలు అందించాలని గుర్తు చేసింది. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న రోహిత్ ను టెస్ట్ పోస్ట్ నుంచి ఊస్ట్ చేసిన బిసిసిఐ.. ఇప్పుడు రోహిత్ మీద అపారమైన ప్రేమ కనబరచడం నిజంగా విశేషమే. రోహిత్ శర్మను ఉద్దేశించి బీసీసీఐ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారగా.. బీసీసీఐ పెద్దలను రోహిత్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read : రోహిత్ అంటే పేరు కాదు, క్రికెట్ చరిత్రలో బ్రాండ్