Samantha : నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత(Samantha Ruth Prabhu) చాలా కాలం నుండి సోలో జీవితాన్ని గడుపుతుంది అంతా అనుకున్నారు. కానీ ఆమె జీవితం లో కూడా ఒకరు ఎంట్రీ ఇచ్చారు అనే విషయం ఈమధ్యనే తెలిసింది. తనని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో క్రూరమైన విలన్ గా చూపించిన డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో సమంత చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. రీసెంట్ గా సమంత తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కూడా తనతో పాటు రాజ్ కూడా ఉన్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీళ్లిద్దరు ముంబై లో ఎన్నో ఈవెంట్స్ కి కలిసి జంటగా వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
ఇక రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ‘న్యూ బిగినింగ్స్’ అంటూ కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసింది. అందులో ఆమె ప్రియుడు రాజ్ నిడిమోరు కూడా ఉన్నాడు. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అనే విషయం వాస్తవం, వీళ్ళ పెళ్ళికి ఇరు కుటుంబాల నుండి మద్దతు కూడా లభించింది. ఈ ఏడాది లోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగ చైతన్య శోభిత ని పెళ్ళాడి తన కొత్త జీవితాన్ని ప్రారంభించడం తో, సమంత ని కూడా ఆమె అభిమానులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చాలా వరకు కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే ఆమె రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే సమంతకు ఈ ప్రేమ లాంటివి కలిసి వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఎందుకంటే ఆమె నాగ చైతన్య ని ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. సుమారుగా మూడేళ్ళ పాటు డేటింగ్ చేసి ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు.
ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఈ జంటకు ఒక మంచి పేరు కూడా వచ్చింది. కానీ పెళ్ళైన నాలుగేళ్లలోనే వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సమంత మళ్లీ ప్రేమ వివాహం చేసుకోబోతుంది, ఈసారైనా ఎలాంటి మనస్పర్థలు లేకుండా అద్భుతమైన దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, చాలా కాలం నుండి అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో భాగంగా ఆమె ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని స్థాపించింది. ఈ సంస్థ నుండి తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ‘శుభమ్’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. హీరోయిన్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సమంత, నిర్మాతగా కూడా అదే రేంజ్ కి చేరుకుంటుందో లేదో చూడాలి.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత