Site icon OkTelugu

Jagan Mohan Reddy Temple Visit Controversy: జగన్ ఆలయాల్లో పూజలు చేస్తే ఆ చర్చ ఖాయం!

Jagan Mohan Reddy Temple Visit Controversy

Jagan Mohan Reddy Temple Visit Controversy

Jagan Mohan Reddy Temple Visit Controversy: ( Andhra Pradesh) లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. నెయ్యి కల్తీ జరిగిందని తేల్చింది. అయితే జంతు కొవ్వు కలపలేదు కదా అని ప్రశ్నిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా ప్రజలకు అర్థమయింది. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి హిందూ వ్యతిరేకముద్ర ఉంది. కానీ అది పక్కకు కొట్టుకుపోయింది ఆ పార్టీ హవాతో. కానీ ఇప్పుడు మాత్రం కుదిరే పని కాదు. ఎందుకంటే హిందుత్వ వ్యతిరేకం ముద్ర ఆ పార్టీపై మరింత బలపడింది. ప్రత్యర్థులు సైతం దానినే హైలెట్ చేస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గ పులివెందులలో పర్యటించారు. అక్కడ శివాలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బలమైన చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి ఎందుకు హాజరు కాలేదన్నది నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న.

Also Read: అభిషేక్‌ పోస్ట్‌… చెప్పుతో యూవీ రిప్లై!

* సొంత నియోజకవర్గంలో.. పులివెందుల( pulivendula) పర్యటనలో భాగంగా వేంపల్లి మండలం నందిపల్లి లో జరిగిన పార్వతీదేవి సమేత మహానందీశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పంచె కట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించిన జగన్ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అయితే ఈ పర్యటనలో ఒక ప్రధానమైన లోటు కనిపిస్తోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు భార్యా సమేతంగా వెళ్లడం హిందూ సాంప్రదాయం. కానీ ఈ వేడుకల్లో జగన్ భార్య భారతి ఎక్కడ కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

* సతీ సమేతం ఆనవాయితీ..
సాధారణంగా ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలు దంపతులు కలిసి పూజలో పాల్గొనడం ఆనవాయితీ. అయితే జగన్ పర్యటన అంతా బాగానే సాగినా.. పక్కనే ఆయన భార్య లేకపోవడం ప్రత్యర్థులతో పాటు సామాన్య జనం ప్రశ్నల వర్షానికి కారణం అవుతోంది. మీ ఆవిడ భారతి ఎక్కడ? అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీసినంత పనిచేస్తున్నారు. గతంలోనూ తిరుమల పర్యటనలో జగన్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రశ్నలే వచ్చాయి. కుటుంబ సభ్యులను ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు ఎందుకు దూరం పెడుతున్నారు అన్నది ఇప్పుడు చర్చకు దారి తీసింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబ అన్యమతంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అసలే హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉన్న తరుణంలో.. టిటిడి ఘటనల నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇటువంటి వివాదాలు రావడం సర్వసాధారణంగా మారనుంది. మున్ముందు జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల సందర్శన, హిందూ అంశాలపై మాట్లాడే క్రమంలో ఇటువంటి ప్రశ్నలు రావడం సర్వసాధారణం కానుంది.

Exit mobile version