https://oktelugu.com/

Senior Actor: సీనియర్ నటుడు కొనుగోలు చేసిన ఈ ఖరీదైన కారు ధర ఎంతో తెలుసా?

Senior Actor: ప్రభాస్ నటించిన సాలార్ లో ఫృథ్వీ విలన్ గా కనిపించారు. హీరోగానూ, విలన్ గానూ తనదైన శైలిలో నటిస్తున్న పృథ్వీ రాజ్ లేటేస్ట్ గా ఓ కారును కొనుగోలు చేశాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 26, 2024 / 12:45 PM IST

    Prithviraj Sukumaran new Car 911 GT3 Price

    Follow us on

    Senior Actor: సినీ ఇండస్ట్రీకి చెందిన నటుల్లో కొంత మంది కార్లు అంటే బాగా ఇష్టపడుతారు. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తారు. డిఫరెంట్ కార్లలో ప్రయాణించాలన్న కాంక్షతో ఖరీదైనా సరే.. వాటిని సొంతం చేసుకుంటారు. తాజాగా ఓ సౌత్ హీరో ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఈ కారుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలిసిన తరువాత కారు వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇంతకీ కొత్త కారు కొన్న హీరో ఎవరు? ఆ కారు విశేషాలేంటి? ఆ వివరాల్లోకి వెళితే..

    సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు పృథ్వీ రాజ్ సుకుమారన్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరో తెలుగులోనూ సుపరిచితుడే. ఆయన తమిళం, మలయాళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దీంతో పృథ్వీకి తెలుగులోనూ ఫ్యాన్స్ పెరిగాయి. ఆ తరువాత ప్రభాస్ నటించిన సాలార్ లో ఫృథ్వీ విలన్ గా కనిపించారు. హీరోగానూ, విలన్ గానూ తనదైన శైలిలో నటిస్తున్న పృథ్వీ రాజ్ లేటేస్ట్ గా ఓ కారును కొనుగోలు చేశాడు.

    Also Read:  Kalki Movie Ticket: కల్కి సినిమా ఒక్కో టికెట్ 2300.. ఇంత డిమాండ్ ఎక్కడంటే..?

    ఫృథ్వీ రాజ్ గ్యారేజీలో ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. లేటేస్ట్ గా ఈయన 911 GT3 అనే వెహికల్ ను కొనుగోలు చేశాడు. ఈ కారు 4 లీటర్ 6 సిలిండర్ నేచురల్ ఆస్పిరేటేడ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇందులో 518 బీహెచ్ పీ పవర్ వద్ద 468 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ వెహికల్ గంటకు 296 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇది 375 కిలో వాట్ పనితీరును కలిగి ఉంది.

    ఈ కారు ధర దాదాపు రూ. 3కోట్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఫృథ్వీ రాజ్ సుకుమార్ వద్ద ఇప్పటికే అనేక లగ్గరీ కార్లు ఉన్నాయి. కానీ వీటిలో అత్యాధునికమైన కారుతో పాటు ఖరీదైన కారు ఇదే. ఇది 6 స్పీడ్ జీటీ స్పోర్ట్స్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. ఈ కారును ఇప్పటికే టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఫృథ్వీ కొనుగోలు చేయడం ఇండస్ట్రీ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

    Also Read: Horror Comedy Movie OTT: నేరుగా ఓటీటీలో ఆ హారర్ కామెడీ చిత్రం…ఎక్కడ చూడొచ్చు?

    ప్రస్తుతం ఫృథ్వీ రాజ్ ‘ఎంపురాన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది లూసీఫర్ రెండోభాగం. దీనిని తెలుగులో గాడ్ఖ ఫాదర్ పేరిట రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఫృథ్వీ రాజ్ కారు పిక్స్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చాలా మంది కారు ప్రియులు ఈ కారును బాగా లైక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Prithviraj Sukumaran buys brand new Car