Prabhas new movie : రెబెల్ స్టార్ ప్రభాస్ దూకుడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా, తొందరగా పూర్తి చేసి విడుదల చేస్తున్నాడు. గడిచిన 8 నెలల్లో ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటి బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల బిజినెస్ అందించాడు. ఈ ఏడాది విడుదలైన ‘కల్కి’ చిత్రం దాదాపుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి మన అడ్మరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కల్కి మూవీ థియేటర్స్ లో నడుస్తున్న సమయంలోనే విడుదల చేశారు. దానికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ ని చూశామని అభిమానులు మురిసిపోయారు.
ఇదంతా పక్కన పెడితే ఈ గ్లిమ్స్ వీడియో విడుదలైన కొద్దిరోజులకే ప్రభాస్ హను రాఘవపూడి తో ఒక సినిమాని ప్రారంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా నిన్న మదురై లో మొదలైంది. ప్రభాస్ లేకుండా ఇతర తారాగణంతో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది, ఈ షెడ్యూల్ కి ప్రభాస్ దూరంగానే ఉంటాడు. రాజా సాబ్ ప్రస్తుత షెడ్యూల్ పూర్తి అయ్యినప్పుడే, ఆయన ఫౌజీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కూడా సిద్ధం చేస్తున్నారట.
దసరా కానుకగా ఈ గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రధాన భాగం పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. 1945 వ సంవత్సరం లో సాగే ఈ కథలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా నటిస్తున్నాడు. ఇందులో ఆయన ప్రభాస్ కి తండ్రిగా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రం లో ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నాడు. కేకే ఇప్పటికే సాహిత్యం అందించగా, రెండు పాటలను రికార్డు చేసినట్టు తెలుస్తుంది. ఇంత వేగంగా ఈ సినిమా పూర్తి అవుతుంది. అన్ని కలిసి వస్తే వచ్చే ఏడాది ప్రభాస్ నుండి మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి, వాటిల్లో ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ తో పాటుగా ‘కల్కి 2 ‘ కూడా ఉంటుంది.