Homeఆంధ్రప్రదేశ్‌johnny Master Issue  :  జానీ మాస్టర్ ఎపిసోడ్ వెనుక మరో కథ.. నాగబాబు సంచలన...

johnny Master Issue  :  జానీ మాస్టర్ ఎపిసోడ్ వెనుక మరో కథ.. నాగబాబు సంచలన ట్విట్

johnny Master Issue : తెలుగు చిత్ర పరిశ్రమలో జానీ మాస్టర్ వివాదం ప్రకంపనలు రేపుతోంది. ఆయన జనసేనలో యాక్టివ్ గా ఉండడంతో రాజకీయంగాను సంచలనం అవుతోంది. తన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ జనసేనలో యాక్టివ్ గా ఉండేవారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ గా పని చేశారు. దీంతో జనసేన అలర్ట్ అయింది. ఈ ఆరోపణ తేలేవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. మరోవైపు జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన నార్త్ ఇండియా లో ఉన్నారని తెలియడంతో అక్కడకు వెళ్లారు. కానీ ఆయన పరారైనట్లు తెలుస్తోంది. చివరకు గోవాలో పట్టుబడినట్లు సమాచారం. కానీ పోలీసులు ఇంతవరకు ధృవీకరించలేదు.

* ఎక్కడా పేరు ప్రస్తావన లేకుండా
అయితే ఈ అంశంపై తాజాగా స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు. ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించకుండా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. వైరల్ గా మారింది. ‘నేరం నిరూపితం అయ్యేవరకు ముద్దాయి నిరపరాధే’ అనే ఫేమస్ కొటేషన్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అక్కడితో ఆగకుండా మరో ట్విట్ లో విన్నవన్నీ నిజాలు కావు.. ఓ ఘటనకు మూడు రకాల కథనాలు ఉంటాయి.. నీది, అవతల వాళ్ళది, అసలు నిజం.. అంటూ ఓ ఫేమస్ రైటర్ రాసిన కొటేషన్ ను షేర్ చేశారు. సరిగ్గా జానీ మాస్టర్ ఎపిసోడ్ నడుస్తున్న క్రమంలోనే నాగబాబు ఇలా పోస్టులు పెట్టడం విశేషం.

* ప్రత్యక్షంగా వేటు
అయితే ఈ పోస్టుల విషయంలో నాగబాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే జనసేన హై కమాండ్ పార్టీ కార్యకలాపాలకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని సూచించింది. మరోవైపు నాగబాబు పరోక్షంగా జానీ మాస్టర్ కు మద్దతు తెలిపినట్లు అయింది. ఈ కేసులో తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయని.. నిజానిజాలు తేలే వరకు ఆగండి అని అందరికీ సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నాగబాబు ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

* భిన్నంగా కామెంట్లు
సోషల్ మీడియాలో నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. అనుకూల వర్గాల వారు ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ప్రత్యర్థులు అయితే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే.. నిందితుడికి సమర్థిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసినోడు మనోడు అయితే మంచోడా? అని నిలదీస్తున్నారు. కాగా జానీ మాస్టర్ గోవాలో పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version