The Raja Saab: ఒక హీరో అభిమాని మరో హీరో అభిమాని సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం సహజమే. సోషల్ మీడియా లో ఇలాంటి ఫ్యాన్ వార్స్ చాలానే జరుగుతూ ఉన్నాయి. దీనిని ఎవ్వరూ మార్చలేరు. అయితే ఈమధ్య కాలం లో ఒక సరికొత్త ట్రెండ్ మొదలైంది. సొంత హీరో అభిమానులే తమ హీరో సినిమాపై ట్రోల్స్ వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రభాస్ అభిమానులు ‘రాజా సాబ్’ సినిమా పట్ల అదే చేస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అన్ని పాన్ ఇండియన్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే ఆయన చేస్తూ వచ్చాడు. మన టాలీవుడ్ ఆడియన్స్ నేటివిటీ కి తగ్గట్టుగా కమర్షియల్ సినిమాలకు దూరం అయ్యాడు. అలాంటి సమయంలో డైరెక్టర్ మారుతీ దర్శకత్వం లో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడని వార్త వచ్చింది. ఈ వార్త వచ్చినప్పుడు ఈ చిత్రాన్ని ఆపేయాలని సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ఆ ట్రెండ్ చేసారు.
ఎందుకంటే మారుతీ మీడియం రేంజ్ డైరెక్టర్. ఆయన గత చిత్రం ‘పక్క కమర్షియల్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాంటి డైరెక్టర్ తో ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలు సినిమా చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు, అలాంటిది ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయడమా..?, దీనిని మేము అసలు అంగీకరించము, వెంటనే ఈ చిత్రాన్ని ఆపేయాలి అంటూ అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే ఈ చిత్రానికి ‘రాజా సాబ్’ అని టైటిల్ ని పెట్టి, లుంగీ గెటప్ లో మాస్ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన తర్వాత అభిమానులు కాస్త చల్లబడ్డారు. ఈ సినిమాకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఫస్ట్ లుక్ తర్వాత గ్లిమ్స్ వీడియో వచ్చింది. అందులో కూడా ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ గా ఉండడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
పుట్టినరోజు నాడు విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త డిఫరెంట్ లుక్ కూడా ఫ్యాన్స్ కి నచ్చేసింది. పర్వాలేదు, ప్రభాస్ రేంజ్ కి తగ్గ సినిమానే చేస్తున్నాడని ఈ సినిమాకి సపోర్టు చేయడం మొదలు పెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే నిన్న ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విన్న తర్వాత ప్రభాస్ అభిమానులు మళ్ళీ నెగటివ్ అయిపోయారు. మాకు ఈ సినిమా అసలు అవసరం లేదు, వెంటనే ఆపేయండి అంటూ నిర్మాతలను ట్యాగ్ చేసి పోస్టులు వేశారు. అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకున్న మేకర్స్, సోషల్ మీడియా లో నిన్నటి నుండి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేందుకు రేయింబవళ్లు షూటింగ్ చేస్తున్నామని, మేము అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మొద్దు అంటూ ఒక ప్రకటన విడుదల చేసారు. దీనికి అభిమానులు కాస్త శాంతించారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు. భవిష్యత్తులో ఏదైనా తేడా అయితే మళ్ళీ ఈ సినిమాకి వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.