https://oktelugu.com/

 Ration Card Holders : రేషన్‌ కార్డుపై సన్నబియ్యం.. అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

తెలంగాణలో రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ దిశగా చర్యలు చేపట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 19, 2024 / 06:50 PM IST

    Ration Card Holders

    Follow us on

    Ration Card Holders :  తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని, రేషన్‌ కార్డుపై పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ, ఏడాది పాలన ముగిసినా కొనత్త రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. సన్నబియ్యం పంపిణీ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే వానాకాలం సన్నవడ్ల సాగును ప్రోత్సహించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు గణనీయంగా సన్నవడ్లు సాగు చేశారు. ప్రభుత్వం కూడా బోనస్‌ చెల్లించి కొనుగోలు చేస్తోంది. ధాన్యం సేకరణ ప్రస్తుతం జరుగుతోంది మరో నెల రోజులపాటు కొనుగోళ్లు సాగే అవకాశం ఉంది. మిల్లింగ్‌కు మరో నెల రోజులు సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    రెండు నెలల్లో సన్నబియ్యం..
    ప్రస్తుతం రేషన్‌ కార్డులపై పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. చాలా మంది బియ్యాన్ని తినకుండా విక్రయిస్తున్నారు. మిల్లర్లు వీటిని కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ చేస్తున్నారు. కొందరు మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు సన్న బియ్యం పపిణీ చేయాలని నిర్ణయించింది. రాబోయే రెండు నెలల్లో సన్న బియ్యం పపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. వానాకాలం సేకరించిన సన్న బియ్యం మిల్లింగ్‌ తర్వాత రేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయాలని నిర్నయించింది.

    అసెంబ్లీలో ప్రకటన..
    రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరికి నెలనెలా దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆ స్థానంలో రెండు నెలల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అసెంబ్లీ బేదికగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేశారు. మిల్లింగ్‌ పూర్తయిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. దొడ్డు బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగిలోనూ సన్న వడ్లు సాగుచేసిన రైతులకు బోనస్‌ ఇస్తామని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా చాలా మంది తింటారని తెలిపారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.