Virat Kohli : ఇండియన్ క్రికెట్ హిస్టరీలో విరాట్ కోహ్లీ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ కూడా గెలిచే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఇండియన్ టీమ్ కి చాలా సంవత్సరాల పాటు కెప్టెన్ గా తనదైన రీతిలో సేవలను అందించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సిరీస్ లో ఆడుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో స్థానిక మీడియా ప్రతినిధులతో విరాట్ కోహ్లీ గొడవ పెట్టుకున్నాడు. దానికి కారణం ఏంటి అంటే కొంతమంది మీడియా ప్రతినిధులు తమ ప్రమేయం లేకున్న తమ పిల్లల ఫోటోలు తీస్తున్నారని అలా తీయడం సరైన విషయం కాదు అంటూ విరాట్ కోహ్లీ మాట్లాడగా ఇక అందులో ఒక మహిళా జర్నలిస్టు తో విరాట్ కోహ్లీ కొంతవరకు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా కోహ్లీ గ్రౌండ్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటూ మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ బయట మాత్రం ఎప్పుడూ చబ్బి చబ్బీగా ఉంటూనే సెలబ్రిటీల మీద గాని జోకులు వేస్తూ వాళ్ళను ఇమిటేట్ చేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు.
మరి ఇలాంటి కోహ్లీ కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేడు. అందువల్లే ఇలాంటి ఒక చిన్న పరిణామం అయితే జరిగిందని కొంతమంది చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది మాత్రం వాళ్ళ ప్రమేయం లేకుండా మీడియా వాళ్ళు ఎలా తీస్తారు వాళ్ళ పిల్లల ఫోటోలు తీయడానికి వాళ్లకు ఎలాంటి రైట్ ఉంది అంటూ కొంత మంది మీడియా ప్రతినిధులతో కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా విరాట్ కోహ్లీ లాంటి ఒక దిగ్గజ ఆటగాడు ఇలాంటి వార్తల్లో నిలవడం అనేది కొంతవరకు కొంతమందిని ఇబ్బంది పెట్టే విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా లో ఆడుతున్నారు. ఇక ఐదు టెస్టు మ్యాచుల్లో భాగంగా మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి.
అందులో ఇండియా ఒక మ్యాచ్ గెలవగా, మరొక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక మొత్తానికైతే ఇండియన్ టీమ్ డబ్ల్యూటిసి ఫైనల్ లోకి ఎంటర్ అవ్వాలంటే మంది మాత్రం మిలిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలవాల్సిన అవసరం అయితే ఉంది…