యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాతృతంతో నిజంగా ‘బాహుబలి’ అనిపించుకున్నాడు. ఇప్పటికే కరోనా నివారణలో భాగంగా ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున కోటి రూపాయాలను ప్రకటించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా సీనీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ సంస్థకు రూ.50లక్షల విరాళాన్ని ప్రభాస్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఒక్కేడే రూ.4.5కోట్ల విరాళం ప్రకటించినట్లయింది.
కరోనా ఎఫెక్ట్ తో చిత్రపరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) మనకోసం’ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉన్నారు.
సీసీసీకి మొదటగా చిరంజీవి ఒక కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. అదేవిధంగా కింగ్ నాగార్జున కోటి రూపాయాలు, రాంచరణ్ 30లక్షలు, మహేష్ బాబు 25లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 25లక్షలు, రవితేజ 20లక్షలు, సాయిధరమ్ తేజ్ 10లక్షలు తదితరులు విరాళాలను ప్రకటించారు. తాజాగా ప్రభాస్ ‘సీసీసీ మనకోసం’కు రూ.50లక్షలు ప్రకటించి సినీ కార్మికులను ఆదుకోవడంలో తాను ముందే ఉంటానని ప్రకటించాడు. ఇప్పటివరకు ప్రభాస్ మొత్తంగా రూ.4.5కోట్ల విరాళం ప్రకటించడం విశేషం. దీంతో ప్రభాస్ నిజంగా ‘డార్లింగ్’ అంటూ అభినందిస్తున్నారు.