‘ఆచార్య’ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని రాంచరణ్ కొడిదెల ప్రొడక్షన్లో బ్యానర్లో, మ్యాట్నీ ఎంటటైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
తొలుత ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్ ను ఉగాది రోజున రిలీజ్ చేయాలని భావించారని తెలుస్తోంది. అయితే చిరంజీవి అదేరోజు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడం.. అదేరోజు ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ విడుదల ఉండటంతో విరమించుకున్నారట. తాజాగా శ్రీరామనవమికి ఫస్టు లుక్ విడుదల చేయాలని చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు సమాచారం.
రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ, టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడగా.. ఫస్టు లుక్ విడుదల పండుగకు అభిమానుల్లో జోష్ నింపే యత్నం చేస్తుంది చిత్రబృందం. అయితే దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.