https://oktelugu.com/

Prabhas : కన్నప్ప లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉందా లేదా..?

Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.

Written By: , Updated On : March 20, 2025 / 10:31 AM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మాత్రం సరైన సక్సెస్ ఫుల్ సినిమాలను చేయలేక ఇండస్ట్రీలో నిలబడలేక నానా తంటాలు పడుతున్నారు. ఇక వీళ్ళకంటే వెనకాల వచ్చిన హీరోలు సైతం మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో వాళ్లు మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు(Mohan Babu) కి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు ఆయన విలన్ గా, కామెడీ విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక ఇప్పటికే ఆయన నటనకి అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అడపాదడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు తన నట వారసుడు అయిన విష్ణు (Vishnu) సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తు ఉండడం విశేషం… ఇక ఈ సినిమాలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ యాక్టర్ కూడా నటిస్తున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాడు.

Also Read : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి అందాల బ్యూటీ…

కాబట్టి అతన్ని ఇందులో భాగం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మోహన్ బాబు వల్లే ఇది సాధ్యమైంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మరి ఈ పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఉందా? ప్రభాస్ కనిపించినంత సేపు థియేటర్లో అరుపులు వినిపిస్తాయా లేదంటే ఈ క్యారెక్టర్ ని నాసిరకపు క్యారెక్టర్ గా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి ప్రభాస్ క్యారెక్టర్ కనక బాగా పేలినట్లతే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టడమే కాకుండా మంచి విజయాన్ని కూడా సాధిస్తుందంటూ పలువురు విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. పాత్ర బాగుంటే కనుక సినిమా ఆటోమెటిగ్గా మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతోంది.

ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ ను నమోదు చేస్తుంది. ఇక 150 కోట్లు బడ్జెట్ ని కేవలం ఐదు ఆరు రోజుల్లోనే రాబట్టే కేపాసిటీ ఉంది. కాబట్టి ప్రభాస్ క్యారెక్టర్ ను బాగా వాడుకుంటే మాత్రం సినిమాకి భారీగా హెల్ప్ అవుతుంది. కానీ అనవసరపు ఇగోలకు వెళ్లి ప్రభాస్ క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపించాలని చూస్తే మాత్రం సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మంచు విష్ణు సినిమా ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అతనికి సలహాలను ఇస్తున్నారు…

Also Read : ప్రభాస్ కంటే చిన్నదే అయినప్పటికి తనకి తల్లి గా నటించిన స్టార్ హీరోయిన్…