Chiranjeevi
Chiranjeevi : సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి హీరోలు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే సినిమాలని చూస్తూ ప్రేక్షకులు ఆనంద పడుతూ ఉంటారు. కానీ తెరవెనక ఆ సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడు ఎంతలా కష్టపడతాడనే విషయాన్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. ఈ విషయం లో హీరోలతో పోలిస్తే దర్శకులకి కొంతవరకు అన్యాయం జరుగుతుందనే చెప్పాలి… ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తు హీరోలను సైతం పాన్ ఇండియా హీరోలుగా మారుస్తున్నారు…
Also Read : చిరంజీవి లైనప్ చూస్తే మెంటలెక్కిపోతారు..రామ్ చరణ్ కూడా వెనకబడ్డాడుగా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఇక ఇయర్ ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా 300 కోట్లకు పైన కలెక్షన్ల ను రాబట్టి తన కెరియర్ లోనే భారీ సక్సెస్ ని సాధించాడు. మరి ఈ సినిమాతో సీనియర్ హీరోలతో కూడా ఆయన భారీ సక్సెస్ ని సాధించొచ్చు అని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవితో చేయబోయే సినిమా విషయం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమాలన్నింటిని చూస్తున్నారట. అందులోని కొన్ని మేనరిమ్స్ ని పట్టుకొని వాటిని ఇప్పుడు చేయబోయే సినిమాలో రీ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి ఏది చేసినా కూడా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా చేస్తూ ఉంటాడు. మరి ఈ సినిమాలో కూడా అటు కామెడీ చేస్తూనే చిరంజీవి ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టబోతున్నాడనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అనిల్ సినిమాల్లో కథ పెద్దగా ఏమీ ఉండకపోయిన కూడా ట్రీట్మెంట్ బాగా రాసుకుంటాడు.
అలాగే సినిమా మేకింగ్ ని కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సినిమాలను చూడడానికి యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్లే ఆయనకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. ఇప్పటివరకు 8 సినిమాలు చేస్తే 8 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక సపరేటు ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టాయి.
ఒకప్పుడు జంధ్యాల కామెడీ సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధించాడు. ఇక ఆయన తర్వాత ఇవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి దర్శకులు కామెడీ జోనర్స్ లో సినిమాలను చేయడమే కాకుండా మంచి విజయాలను అందుకున్నారు. ఇక వాళ్ళ తర్వాత వాళ్ళ జనరేషన్ ను ముందుకు తీసుకెళ్లడంలో అనిల్ రావిపూడి చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
మరి ఇక మీదట ఆయన చేస్తున్న సినిమాలు సాధిస్తాయా? తద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్క్ ను క్రియేట్ చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చిరంజీవి సైతం అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం విశేషం.
Also Read : మెగాస్టార్ చిరంజీవి పల్లెబాట..కారణం ఏమిటంటే!